
ప్రస్తుత రోజుల్లో మహిళలను ఎక్కువగా భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో రొమ్ము క్యాన్సర్ (Breast cancer) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మహిళలు దీని బారిన పడుతున్నారు. భారతదేశంలో కూడా ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే చాలా మంది దీని గురించి సరైన అవగాహన లేక.. లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ రొమ్ము క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ వ్యాధికి కారణాలు ఏంటి.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లయితే.. మీకు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. BRCA1, BRCA2 వంటి జన్యువులలో మార్పులు (Genetic mutations) ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఒకవేళ మీ కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే.. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఈ అలవాట్లు ముఖ్యంగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
ప్రారంభ దశలో రొమ్ము క్యాన్సర్ గుర్తిస్తే.. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సల ద్వారా నయం చేయవచ్చు. కానీ ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడడం కష్టం కావచ్చు.
రొమ్ము క్యాన్సర్ అవగాహన లోపం వల్ల మరింత ప్రమాదకరంగా మారుతుంది. మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి.. శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బహిరంగంగా మాట్లాడటం, ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.