Eye Health: కళ్ల ఆరోగ్యం మంచిగా ఉండాలంటే.. ఇలా తలస్నానం చేయాల్సిందే..!

ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో మందికి చూపు సమస్యలు వస్తున్నాయి. గతంలో పెద్దలకు మాత్రమే చదివేటప్పుడు లేదా దూరాన్ని చూడటంలో ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు స్కూల్ విద్యార్థులు కూడా కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలు కూడా మొబైల్ స్క్రీన్‌ ను ఎక్కువగా చూడటం వల్ల చూపు బలహీనపడుతోంది.

Eye Health: కళ్ల ఆరోగ్యం మంచిగా ఉండాలంటే.. ఇలా తలస్నానం చేయాల్సిందే..!
Eye Health

Updated on: Jun 10, 2025 | 10:33 PM

ఈ సమస్యకు ముఖ్య కారణం.. చిన్న వయసులోనే పిల్లలు మొబైల్స్, టాబ్లెట్ల వంటి గ్యాడ్జెట్లకు అలవాటు పడటం. ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల కంటి నరాలు దెబ్బతిని మానసిక సామర్థ్యం కూడా తగ్గుతుంది. దీని వల్ల చూపు బలహీనపడుతుంది. అంతేకాదు మెడ వెనక భాగంలో నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి సంప్రదాయ పద్ధతిలో నూనెతో తలస్నానం చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా సిద్ధ వైద్యంలో తప్పలం అనే ఒక విధానం ఉంది. ఇందులో కొన్ని ఆయుర్వేద మూలికల పొడులను పాలలో కలిపి తలపై రాయడం జరుగుతుంది. ఆ తర్వాత రోజు తలకు నూనె రాసి స్నానం చేస్తే కళ్ళకు మంచిదని చెబుతారు.

  • తప్పలం తయారీకి కావాల్సిన మూలికలు
  • తాండ్రికాయ (Gallnut)
  • కీళ‍నెల్లి (Phyllanthus amarus)
  • అతిమధురం (Licorice root)
  • జీలకర్ర
  • ఉసిరికాయ

వీటి పొడిని తీసుకుని పచ్చిపాలలో కలిపి తలపై రాయాలి. తలపై తట్టి తట్టి రాసే ఈ పద్ధతినే తప్పలం అంటారు. ఇది నెమ్మదిగా చూపు మెరుగుపడటానికి సహాయపడుతుంది.

కీజ్హనెల్లి తైలం (Keezhanelli oil), నోచ్చి తైలం (Nochchi oil), అరుగన్ తైలం (Arugan oil) వంటి నూనెలను వాడటం కూడా మంచిదే. ఇవి కళ్ళకు శక్తినిచ్చే నూనెలుగా గుర్తించబడినవి.

ముఖ్యంగా చెప్పాలంటే.. వైట్ కరిసలంకన్ని (white Karisalankanni) అనే మూలిక చూపు మెరుగుదల కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో అనేక రకాల సమస్యలకు నివారణగా పని చేస్తుంది. ఈ వైట్ కరిసలంకన్ని పొడి (white Karisalankanni powder), వాము పొడి (Ajwain powder), పెరుకాయ పొడిని తీసుకుని, దానిమ్మ రసంతో కలిపి రోజూ ఒక స్పూన్ తీసుకుంటే కళ్ళ చూపు మెరుగుపడుతుంది అని చెబుతారు. ఈ మిశ్రమం కళ్ళ నరాల శక్తిని పెంచి మెదడు పనితీరును కూడా బలపరుస్తుంది.

చిన్న వయసులోనే పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో కళ్ళద్దాలు లేకుండా జీవించవచ్చు. మొబైల్ వాడకాన్ని తగ్గించడం, సిద్ధ వైద్య పద్ధతుల్లో తలస్నానం వంటివి పాటించడం ద్వారా చూపు బలహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)