మన రోజువారీ అలవాట్లు మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటి ప్రభావం మన చర్మంపై కూడా కనిపిస్తుంది. దీని వల్ల మనిషికి అకాల వృద్ధాప్యం వస్తుందని తాజా పరిశోదనల్లో తేలింది. వారు జరిపిన పరిశోధనల్లో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా మహిళలు తమ మేకప్ చాలా ప్రభావం చూపిస్తుందని తేలింది. ఎక్కువ మేకప్ వేసుకునే అలవాటు కూడా త్వరగా వృద్ధాప్యాన్ని తీసుకురావడానికి కారణం అవుతుంది. వాస్తవానికి.. చాలా మేకప్ ఉత్పత్తులలో రసాయనాలు, ఆల్కహాల్ ఉంటాయి. ఇవి చర్మాన్ని పొడిగా చేస్తాయి. దీని కారణంగా చర్మం కొవ్వు తగ్గడం మొదలవుతుంది. సమయానికి ముందే ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి.
ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల శరీరం, మనస్సుపై చెడు ప్రభావం పడటమే కాకుండా దాని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. మితిమీరిన ఒత్తిడి కారణంగా ముఖంపై త్వరలో ముడతలు రావడం ప్రారంభమవుతాయని.. మీరు అకాల వృద్ధాప్యం మీలో కనిపిస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ధూమపానం, అతిగా మద్యం సేవించే వారికి కూడా త్వరగా వృద్ధాప్యం వస్తుందట. ధూమపానం, ఆల్కహాల్ చర్మాన్ని పొడిగా చేస్తాయి. అలాగే జీవక్రియను నెమ్మదిస్తుంది. దీని కారణంగా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి. దీనివల్ల శరీరంపై అకాల వృద్ధాప్యం కనిపిస్తుంది.
మీరు అర్థరాత్రి వరకు టీవీ చూడటం కూడా పెద్ద ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అంతే కాదు టీవీ చూసేవారితోపాటు ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌లో గంటల తరబడి ఉండేవారిని కూడా వారి పరిశోధనలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఇలాంటి అలవాట్లు మీలో ఉన్నట్లైతే ఆ అలవాట్లను సరిదిద్దుకోండి. ఇది కళ్లు, మెదడులోని కణాలను దెబ్బతీసి జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. అలాగే, ఈ అలవాటు వృద్ధాప్యాన్ని త్వరగా తీసుకురావడానికి కారణం అవుతుంది.
నిద్ర లేకపోవడం బరువు పెరుగుట, బలహీనమైన రోగనిరోధక శక్తి, ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో పాటు కళ్ల చుట్టూ నలుపు కూడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో, వ్యక్తి చాలా నీరసంగా, అకాల వృద్ధాప్యంలో కనిపించడం ప్రారంభిస్తాడు.
ఇవి కూడా చదవండి: Conjoined Twins: వారు ఇద్దరు కాదు ఒక్కరు.. పంజాబ్ కుర్రాళ్లు ఉద్యోగం సాధించారు.. స్ఫూర్తిగా నిలిచారు..