
చాలా మంది బెడ్‌రూమ్‌లో నైట్ లైట్ వేసుకుని నిద్రపోతుంటారు. ఇది వారికి సౌకర్యంగా అనిపించినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. నిపుణుల ప్రకారం నిద్ర సమయంలో గదిలో ఉండే వెలుతురు మన శరీర కార్యకలాపాలపై, హార్మోన్ల ఉత్పత్తిపై, మెటబాలిజం పై ప్రభావం చూపుతుందట. ఇప్పుడు ఈ విషయం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
నిద్రలో వెలుతురు ఉండటం వల్ల శరీరానికి నిద్ర హార్మోన్‌గా పేరొందిన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మెలటోనిన్ ఉత్పత్తి తగ్గితే నిద్ర నాణ్యత క్షీణిస్తుంది. దీని వలన శరీరం విశ్రాంతి పొందలేక అంతర్గత సమతుల్యతకు తలకిందులవుతుంది. దీర్ఘకాలంగా ఇలా జరిగితే ఒత్తిడి, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి.
వెలుతురులో నిద్రపోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ సున్నితత్వం తగ్గుతుంది. అంటే శరీరం గ్లూకోజ్‌ను సరైన విధంగా శోషించలేకపోతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ కు దారితీయవచ్చు. ముఖ్యంగా నైట్ లైట్ తో పడుకునే అలవాటు ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు కనిపించవచ్చు.
చూపరులకు కనిపించని సమస్యలలో ఒకటి ఇది. నిద్ర సమయంలో వెలుతురు ఉండడం వల్ల హృదయ స్పందన వేగంగా పని చేస్తుంది. హార్ట్ బీట్ నార్మల్ కంటే ఎక్కువ అవుతుంది. దీని వలన హృదయంపై ఒత్తిడి పెరిగి గుండె సంబంధిత వ్యాధులకు అవకాశం ఏర్పడుతుంది.
చీకటి గదిలో నిద్రపోవడం వల్ల శరీరం పూర్తిగా విశ్రాంతి పొందుతుంది. మెలటోనిన్ సహజంగా విడుదలై నిద్ర నాణ్యత మెరుగవుతుంది. గుండె ధోరణి సమతుల్యంగా ఉండి హార్మోన్ల సమతుల్యత కూడా మెరుగవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో మానసిక ప్రశాంతతను పెంచడంలో సహాయపడుతుంది.
బెడ్‌రూమ్‌లో లైట్ వేసుకుని నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల హార్మోన్ల అసమతుల్యత, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే రాత్రి పడుకునేటప్పుడు గదిని చీకటిగా ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఇవి చిన్న మార్పులే అయినా దీర్ఘకాల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.