గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ఇది అందరికీ మేలు చేసే అవకాశం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాస్తవానికి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా సార్లు గోరువెచ్చని నీటిని తీసుకుంటాము. సాధారణంగా, బరువు తగ్గాలని ప్రయత్నించేవారు, పలు సమస్యలతో బాధపడేవారు.. వేడి లేదా గోరువెచ్చని నీరు తాగుతారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ ప్రతి వ్యక్తి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి.. కొంతమంది వ్యక్తులు గోరువెచ్చని నీటిని తీసుకోవడం మానుకోవాలి.. ఎందుకంటే, ఇది చాలా వ్యతిరేక ప్రభావాలను కలిగిస్తుందని పేర్కొంటున్నారు. అయితే, కొంతమంది వేడి లేదా గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల చాలా దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి రావొచ్చని పేర్కొంటున్నారు.
జలుబు – దగ్గు ఉన్నవారు గోరువెచ్చని నీటిని తాగకూడదు. వేడి నీటిని తీసుకోవడం వల్ల వారి గొంతు వాపు, చికాకు పెరుగుతుంది.. ఇది వారి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. బదులుగా, వారు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి.. ఇది వారి గొంతు పొడిగా ఉండటానికి సహాయపడుతుంది.
చిన్న పిల్లలు పెద్దల మాదిరిగా వేడి నీటిని తాగకూడదు. ఎందుకంటే వారి జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. వేడి నీటి వినియోగం వారి కడుపుకు హాని కలిగిస్తుంది. వారు సాధారణ నీటిని తీసుకోవాలి, లేకుంటే చిన్నారులు అనేక కడుపు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వేడి నీటిని నివారించాలి. ఎందుకంటే ఇది వారి కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. వారు చల్లని నీరు త్రాగాలి. వైద్యుల సలహా మేరకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలి. కాలేయం చాలా సున్నితమైన అవయవం.. దానిలో ఏదైనా సమస్య ఏర్పడితే, శరీరం వివిధ విధులు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి.
దంతాల సున్నితత్వం ఉన్నవారికి, వేడి – చల్లటి పదార్థాలు రెండూ నొప్పిని పెంచుతాయి. మీరు సమస్యను నివారించాలంటే.. సాధారణ నీటిని మాత్రమే తాగండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి