Blood Cholesterol: గుప్పెడంత గుండె మనిషి జీవితానికి ఆయువు పట్టు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. రోగాల బారిన పడిన తర్వాత లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ బాగు చేసుకుంటున్నాడు. అందుకని ఛాతి నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలి. లేదంటే మనం ఆ సంగతి గ్రహించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ముఖ్యంగా మనం తినే కొన్ని ఆహార పదార్దాలతో మలినాలు , విష పదార్దాలు పెరుగుతాయి. ముఖ్యంగా నూనెతో తినే ఆహారం పదార్దాలు తినడం వల్ల మన రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోయి రక్త ప్రసరణను అడ్డుగా మారుతుంది. ఇలా రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోవడం వలన గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడంవలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని రక్త నాళాల్లో ఉన్న కొవ్వును తొలగించడానికి మనం ఈరోజు ఒక ఆయుర్వేద చిట్కా గురించి తెలుసుకుందాం..
సొరకాయ
పుదీనా
కొత్తిమీర
తులసి ఆకులు
సొరకాయ , పుదీనా , కొత్తిమీర , తులసి ఆకులు ఇవి చాలా సులభంగా దొరికే పదార్దాలే కాదు.. వీటిని ఆయుర్వేదంలో గొప్ప ఔషదాలుగా భావిస్తారు. ముందుగా సొరకాయ రసాన్ని తీసుకుని దానిని ఒక గ్లాస్ లో వేసుకుని.. పది పుదీనా ఆకులు , పది తులసి ఆకులు , కొంచెం కొత్తిమీర ఆకులూ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.. అనంతరం ఈ జ్యుస్ ను తాగితే మన రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు చాలా వరకూ నియంత్రణలోకి వస్తుంది. ఈ జ్యుస్ ను తాగితే నరాల వాపులు, నరాల నొప్పి, నరాల బలహీనత, రక్తం గడ్డకట్టడం , కళ్ళుతిరగడం, గుండె పోటులాంటివి దాదాపు రావు .
Also Read: Mehandi Designs: శుభకార్యాలకు నెలవు శ్రావణం.. అమ్మాయిల చేతులను అందమైన మెహందీ డిజైన్లతో అలంకరించుకోండి ఇలా (photo gallery)