Home remedies for gas: గ్యాస్ సమస్య చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. కొంచెం హెవీగా తిన్నా, కొంచెం తక్కువ తిన్నా.. అసలు తినకుండా ఉన్నా ఇబ్బందులు తప్పవు. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు.. అస్తవ్యస్థమైన జీవనశైలి కూడా గ్రాస్ ట్రబుల్‌కి కారణం అవ్వొచ్చు. ఉప్పు.. కారం.. మసాలా పదార్థాలు అధికంగా తీసుకోవడం..తిన్న వెంటనే పడుకోవడం, అతిగా ఆందోళన, ఒత్తిడికి గురవడం కూడా గ్యాస్ పెరగడానికి కారణమవుతాయి. గ్యాస్ సమస్య ఉంటే పొట్ట ఉబ్బరంగా ఉండటం, పులితేన్పులు, ఛాతీలో, గొంతులో మంట వంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇంట్లో దొరికే పదార్థాలతోనూ గ్యాస్ సమస్య నుంచి బయటపడొచ్చనే విషయం మీకు తెలుసా? సహజసిద్ధంగా గ్యాస్ సమస్యకు చెక్ పెట్టడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- అప్పుడే తయారు చేసిన మజ్జిగను తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు
- తాజా పెరుగు, తీయటి పెరుగు కూడా గ్యాస్ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తాయి
- గ్యాస్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం.. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడమే. కాబట్టి ఆహారం జీర్ణం కావడంలో కీలక పాత్ర పోషించే అల్లంను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే పరగడుపున రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించాలి.
- సోంపు గింజలను నేరుగా తీసుకోవడం కంటే.. వీటితో డికాషన్ చేసుకొని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
- గ్యాస్ సమస్య తగ్గించడంలో కొబ్బరి నీరు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ప్రోటీన్లు గ్యాస్ సమస్యను తరిమి కొడతాయి
- గ్యాస్ సమస్యకు చెక్ పెట్టడంలో లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. భోజనం తర్వాత ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమలాలి. ఇలా చేస్తే గ్యాస్ తగ్గుతుంది. రాత్రి జీలకర్ర నీటిలో నానబెట్టి.. పొద్దున్నే ఆ వాటర్ తాగినా కూడా ఉపశమనం ఉంటుంది
- పక్కమీద ఎడమవైపు తిరిగి పడుకోవాలి. కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు ఆహారనాళం మూత తెరుచుకొని ఆహారపదార్థాలు, పొట్టలోని ఆమ్లం వెనక్కు తన్నుకొచ్చే అవకాశాలుంటాయి. తలకింద కాస్త ఎత్తుగా ఉండే దిండు పెట్టుకుంటే మేలు చేస్తుంది.
- ముఖ్యంగా వేళకు భోజనం చేయాలి. చిన్న చిన్న మోతాదులో ఎక్కవ సార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. పొద్దుపోయాక తినకూడదు.
గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. ఈ పద్దతులను అనుసరించడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.
Also Read: Viral Video: ఈ చిన్నారికి ఎన్ని గుండెలు.. ప్రమాదకర పాముతో ఆటలు.. చూస్తే షాకే