Work From Home: ఇంటి నుంచి పని చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

|

Jan 23, 2022 | 3:55 PM

కరోనాతో చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇంటి నుండి పని చేయడం చాలా సులువుగా ఉంటుంది అనుకుంటారు...

Work From Home: ఇంటి నుంచి పని చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Follow us on

కరోనాతో చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇంటి నుండి పని చేయడం చాలా సులువుగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇంటి పని చేయడం ఇబ్బందే..ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉబకాయమే కాకుండా ఇతర సమస్యలు వస్తున్నాయి.
వాటితో పాటుగా నడుం నొప్పి కూడా చాలా మందిలో ఎక్కువ ఉంటుంది.

కొన్ని చిట్కాలు పాడించడం వల్ల ఈ నడుము నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. నిద్ర పోయేటప్పుడు తల కింద దిండు పెట్టుకోవద్దు. దిండు పెట్టుకోకుండా నిద్రపోవడం వల్ల నడుము నొప్పి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

వ్యాయామ పద్ధతులతో కూడా నడుం నొప్పికి మనం చెక్ పెట్టొచ్చు. నడుము నొప్పి తగ్గాలంటే మకరాసనం, శలభాసనం, మర్కటాసనం, భుజంగాసనం ప్రతి రోజూ చేస్తే మంచిదని డాక్టర్లు తెలిపారు.వర్క్ ఫ్రం హోం చేసే వాళ్లు ఈ టిప్స్‌ని ప్రతి రోజు ఫాలో అయితే మంచిదని చెబుతున్నారు. వెన్ను నొప్పి ఎక్కువగా వచ్చిందంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

Read Also..  Coriander Water Benefits: ఆరోగ్యానికి అమృతం.. ధనియాల నీటితో ఆ సమస్యలన్నీ మటుమాయం..