Home Made Health Tips: రక్తహీనత, రక్త పోటుతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి.. ఉపశమనం పొందండి

|

Jul 07, 2021 | 3:32 PM

Home Made Health Tips: ఒత్తిళ్ళతో కూడిన ఆధునిక జీవితం మనిషి అనారోగ్యానికి కారణమవుతోంది. అనారోగ్యానికి గురైన ప్రతిసారీ వైద్యుని దగ్గరకు వెళ్లడం ఆర్ధికంగానే కాదు శారీరకంగా

Home Made Health Tips: రక్తహీనత, రక్త పోటుతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి.. ఉపశమనం పొందండి
Anemia And Bp
Follow us on

Home Made Health Tips: ఆధునిక యుగంలో వైద్య రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ మంచి ప్రాధాన్యత ఉన్న వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యంలో వ్యాధి తగ్గడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. మన ఇల్లు, ఇంటి పరిసరాల్లో లభించే వాటితోటే కావాల్సిన వైద్యం చేసుకోవచ్చు.ఒత్తిళ్ళతో కూడిన ఆధునిక జీవితం మనిషి అనారోగ్యానికి కారణమవుతోంది. అనారోగ్యానికి గురైన ప్రతిసారీ వైద్యుని దగ్గరకు వెళ్లడం ఆర్ధికంగానే కాదు శారీరకంగా అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. కనుక ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో వైద్యం చేసుకుని ఉపశమనం పొందవచ్చు..

రక్తహీనత: ఈ వ్యాధి శరీరంలో రక్తం తక్కువగా ఉంటె వస్తుంది. మంచి బలమైన ఆహారం తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. కనుక ఈ వ్యాధి నిరోధానికి అల్లోపతి మెడిసిన్స్ వాడడం కంటే.. ఇంట్లో ఉండే పదార్ధాలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేసుకోవచ్చు.

*నీడలో ఎండబెట్టిన సరస్వతి ఆకు చూర్ణం, చిటికెడు మిరియాల చూర్ణం, ఆవుపాలతో కలిపి సేవించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. రక్తవృద్ధి జరుగుతుంది.
*నీడలో ఎండబెట్టిన ఉసిరి చూర్ణాన్ని ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు రోజూ రెండు చెంచాలు తింటూ ఉంటె.. రక్తహీనతను నివారించవచ్చును.
*విటమిన్ బి లోపం వల్ల రక్తహీనత కలిగిన వాళ్ళు గలిజేరు ఆకును కూర లేదా పచ్చడిగా తీసుకుంటే మంచి ఫలితముంటుంది.
*విష్ణుకాంత సమూలం నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. దానిని పాలతో కలిపి తీసుకుంటే రక్త క్షీణత తగ్గుతుంది.

రక్తపు పోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏ లక్షణాలు కనబడవు. అయితే బీపీ అనేది చాప కింద నీరులా శరీరానికి, అవయవాలకు కొంతమేర నష్టం చేకూరుస్తుంది. కనుక బీపీని తప్పని సరిగా ఎక్కువగా కాకుండా తక్కువా కాకుండా అదుపులో ఉంచుకోవాలి.

*సుగంధపాల, మారేడు కలిపి వాడితే బి.పి. అదుపులో ఉంటుంది.
*మారేడు ఆకుల కషాయం రోజూ తాగాలి. లేదా రోజూ చెంచెడు కల్యమాకు రసం తాగినా రక్తపోటు నిలకడగా ఉంటుంది.
*ఈశ్వరి వేరు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.
*కాచి చల్చార్చిన నీటిలో అల్లం రసాన్ని కలిపి పొద్దున్నే తాగితే బి.పి. అదుపులో ఉంటుంది.

Also Read: శ్వాసకోశ వ్యాధులు, నోటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా ఈ చిన్ని చిట్కాలు పాటించి చూడండి