జ్వరమొచ్చింది! గతం వారం రోజుల నుంచి ఎవరి నోట విన్నా ఇదే మాట. తెలంగాణలో ఓవైపు చలి పంజా విసురుతుంటే… మరోవైపు జ్వరాలు దడపుటిస్తున్నాయి. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా జ్వరాలతో జనం సతమతం అవుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు… అందరినీ చుట్టుముట్టేస్తోంది. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా.. ఇలా అన్నీ ఒక్కేసారి ఎటాక్ షురూ చేశాయి.
చికెన్ గున్యా కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. దీంతో ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు. మొన్నటి వరకు 500 ఉన్న ఓపీ ఇప్పుడు 800 నుంచి 100 వరకు పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.
చిన్నారులపై చలి తీవ్ర ప్రభావం చూపిస్తుందని నీలోఫర్ వైద్యులు తెలిపారు. ప్రతిరోజు వెయ్యి మంది చిన్నారులు ఆస్పత్రికి వస్తున్నారన్నారు. తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు వైద్యులు. వాతావరణ మారడంతో రకరకాల వైరస్‌లు దాడి చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో జ్వరాల జాతరపై అమెరికా అలారమింగ్ వార్నింగ్స్ జారీ చేసింది. భారత్ నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి అమెరికాకు వస్తున్న వాళ్లలో చికెన్ గున్యా లక్షణాలు ఎక్కువగా వున్నట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ..CDC గుర్తించింది. చికెన్ గున్యా. డెంగీ వెరల్ ఇన్‌ఫెక్షన్స్ కాబట్టీ అప్రమత్తంగా వుండాలని భారత్‌కు వెళ్లే అమెరికన్లకు సూచించింది. అటు అమెరికా అలారమ్..ఇటు లోకల్‌గా పడేకసిన ప్రజారోగ్యం.. వీటిని దృష్టిలో పెట్టుకొనైనా వైద్యశాఖ స్పందించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఏపీ ప్రభుత్వం కూడా విష జ్వరాలపై అప్రమత్తమైంది. సీజనల్ ఫీవర్స్, ఫుడ్ పాయిజన్స్‌పై అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. అన్ని పీహెచ్‌సీలకు ఫీవర్ ఎమర్జెన్సీ కిట్స్ తరలించారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి సత్యకుమార్.
వైరల్ ఫీవరే కదా అని లైట్ తీస్కోవద్దు. ఎందుకంటే విష జ్వరాలు ప్రాణాలు తీసేస్తాయ్. టైమ్‌కి ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే మాత్రం ప్రాణాలు పోవడం ఖాయం. మెయిన్‌గా ప్లేట్ లెట్స్ పడిపోతాయ్. ఊపిరితిత్తులు, కాలేయం, గుండెపై ప్రభావం చూపిస్తుంది. బీపీ డౌన్ అవుతుంది. టోటల్‌గా బాడీ మొత్తాన్ని గుల్ల చేస్తుంది. అందుకే బీ కేఫ్ ఫుల్.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి