కొవ్వే కదా అని లైట్ తీసుకోకండి.. తేడా కొడితే మీ పని అంతేనట.. బీకేర్‌ఫుల్..

|

Apr 01, 2024 | 1:52 PM

కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు ప్రతీ ఇంట్లో కూడా పట్టిపీడిస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణం.. బయటి ఆహారం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటుంది. ప్రతీరోజూ వ్యాయామం చేయకపోతే ప్రమాదం ఎక్కువ అవుతుంది. అయితే, మీ జీవక్రియ బాగా ఉంటే, కొలెస్ట్రాల్ స్థాయిల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

కొవ్వే కదా అని లైట్ తీసుకోకండి.. తేడా కొడితే మీ పని అంతేనట.. బీకేర్‌ఫుల్..
High Cholesterol
Follow us on

కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు ప్రతీ ఇంట్లో కూడా పట్టిపీడిస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణం.. బయటి ఆహారం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటుంది. ప్రతీరోజూ వ్యాయామం చేయకపోతే ప్రమాదం ఎక్కువ అవుతుంది. అయితే, మీ జీవక్రియ బాగా ఉంటే, కొలెస్ట్రాల్ స్థాయిల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగితే ప్రమాదం కొనితెచ్చున్నట్లే.. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, అది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారి రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది రక్తపోటు, గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతుంది.

అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలు ఏ సమయంలోనైనా గుండె సమస్యలకు దారితీస్తుంది. కానీ చాలా తక్కువ మందికి అధిక కొలెస్ట్రాల్, దాని ప్రభావాల గురించి తెలుసు.. అందుకే గుండెపోటు, పక్షవాతం లాంటి ప్రమాదకర వ్యాధులకు దూరంగా ఉండాలంటే.. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించుకోవాలి.

అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు:

కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కొంచెం గట్టిగా నడిచినా, మెట్లు ఎక్కినా ఊపిరి పీల్చుకునేందుకు ఆయాసంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

కళ్ల కింద ఉబ్బడం కొలెస్ట్రాల్ లక్షణం. కొన్నిసార్లు పసుపు రంగు మచ్చల్లాంటివి కళ్ళపై కనిపిస్తాయి. ఇది హై కొలెస్ట్రాల్ లక్షణం కూడా…

కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఒక్కసారిగా నరాలు మొద్దుబారిపోతాయి. ఆ సమయంలో కాళ్లకు చలనం కూడా అనిపించదు..

ఛాతీ నొప్పి, ఛాతీలో ఒత్తిడి, అసౌకర్యం కొలెస్ట్రాల్ పెరిగిన లక్షణాలు. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అడ్డంకులు ఏర్పడతాయి. దీనివల్ల గుండె జబ్బులు పెరుగుతాయి.

కొలెస్ట్రాల్ వల్ల కూడా అధిక రక్తపోటు రావచ్చు. అధిక రక్త కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనులపై ఒత్తిడిని కలిగిస్తాయి. దీని కారణంగా, రక్త ప్రసరణ చెదిరిపోతుంది.. రక్తపోటు పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ వల్ల దృష్టి మసకబారుతుంది. కళ్లు దెబ్బతింటాయి. అందుకే.. ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు..

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకునే మార్గాలు..

  • కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తినడం, మద్యం త్రాగటం నియంత్రించాలి.
  • వీధి ఆహారాన్ని తరచుగా తినవద్దు. నూనె, కొవ్వు రహిత ఆహారానికి దూరంగా ఉండాలి.
  • కూరగాయలు, ధాన్యాలు, గింజలు, పండ్లు, చేపలు మొదలైన వాటిని ఎక్కువగా తినండి.
  • తినడం, త్రాగడంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • తగినంత నిద్ర పొందండి, ఒత్తిడిని తగ్గించుకోండి.
  • ప్రతి 3 నెలలకు రక్త పరీక్ష చేయడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేయండి.
  • ఇవన్నీ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..