High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు ఈ సంకేతాలు వెలువడుతాయి..!

|

Jul 31, 2022 | 10:00 PM

High Cholesterol: జీవన విధానం సరిగ్గా లేని కారణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతాయి. శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తి గుండెపోటు..

High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు ఈ సంకేతాలు వెలువడుతాయి..!
High Cholesterol
Follow us on

High Cholesterol: జీవన విధానం సరిగ్గా లేని కారణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతాయి. శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తి గుండెపోటు లేదా గుండెకు సంబంధించిన అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఈ మధ్య కాలంలో అధిక కొలెస్ట్రాల్ కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఇది సాధారణ సమస్యగా మారింది. ప్రపంచంలోని ఎంతో మంది కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదల కారణంగా వారు తరచుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అనేక నివేదికలలో వెల్లడైంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో అలసట సమస్య పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి వ్యాయామం చేయడం ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. సిరల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ మందగిస్తుంది. ఈ సందర్భంలో చేతులు లేదా కాళ్ళలో జలదరింపు, నొప్పి మొదలవుతుంది. ఈ కారణంతో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందనే సంకేతం. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని పరిశోధకులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్ స్థాయిని ఎలా నియంత్రించాలి:

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ప్రతిరోజూ పచ్చి కూరగాయలను తినండి. కాలానుగుణ కూరగాయలను తినండి. ఆరోగ్యంగా ఉండేందుకు తక్కువ నూనె, మసాలలను ఉపయోగించడం మంచిది. మీరు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటే మీరు చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. వ్యాయామం కోసం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు కేటాయించడం మంచిది. మీరు వ్యాయామం చేయలేకపోతే, నడక ప్రారంభించండి. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి సిరల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం హైడ్రేట్ గా ఉంటే అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగడం ఎంతో మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..