Hidden Signs of Diabetes: ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే! నిర్లక్ష్యం వద్దు..

డయాబెటిస్ అనేది సాధారణ వ్యాధి కాదు. ఒక్కసారి ఇది ఒంట్లోకి ప్రవేశిస్తే ఎన్నో రకల రోగాలు దాని వెంట వచ్చి శరీరంలో తిష్ఠ వేస్తాయి. అందుకే నేటి కాలంలో దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే కొంతమందికి ఎన్ని సార్లు డయాబెటిస్‌ టెస్ట్‌ చేయించినా రక్తంలో వారి చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ సాధారణంగా ఉంటాయి. కానీ నిరంతరం అలసట వారిని వేదిస్తుంది. దీనిని తరచుగా ఒక సాధారణ సమస్యగా విస్మరిస్తారు..

Hidden Signs of Diabetes: ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే! నిర్లక్ష్యం వద్దు..
Hidden Diabetes Symptoms

Updated on: Feb 15, 2026 | 9:42 PM

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిరంతర అలసట శరీరంలో అంతర్గతంగా దాగిన డయాబెటిస్‌కు సంకేతం కూడా కావచ్చని అంటున్నారు. కాబట్టి లక్షణాలు కనిపించకుండా రహస్యంగా డయాబెటిస్ అంటే ఏమిటి? అది రక్త పరీక్షలలో ఎందుకు సులభంగా కనిపించదు? దానిని కనుగొనడానికి ఏం చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఘజియాబాద్ జిల్లా ఆసుపత్రికి చెందిన డాక్టర్ శాంత్రమ్ వర్మ దీని గురించి మాట్లాడుతూ.. చాలా మందికి చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నప్పటికీ ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. దీని వల్ల బ్లడ్‌ టెస్ట్‌లో చక్కెర స్థాయిలు సాధారణంగానే కనిపిస్తాయి. కానీ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర కొంతకాలం సాధారణంగానే కనిపించవచ్చు. కానీ శరీర కణాలు గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేవు. గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల మధుమేహం సంబంధించి కొన్ని ఇతర లక్షణాలతో పాటు నిరంతరం అలసట కూడా కనిపిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ లక్షణాలు కనిపిస్తే విస్మరించవద్దు..

  • నిరంతరం అలసట
  • తిన్న తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపించడం
  • పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం
  • తరచుగా తీపి తినాలనే కోరిక
  • కొద్దిగా అస్పష్టమైన దృష్టి
  • చర్మంపై, ముఖ్యంగా మెడ, బుగ్గలపై నల్లటి మచ్చలు

చక్కెర స్థాయి సాధారణంగా ఉన్నప్పటికీ అలసటకు కారణమేమిటి?

డాక్టర్ శాంత్రమ్ మాట్లాడుతూ.. చాలా మంది ఖాళీ కడుపుతో మాత్రమే తమ చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకుంటారు. కానీ వారు HbA1c పరీక్ష చేయించుకోరు. ఈ పరీక్ష కూడా ముఖ్యమైనది. ఈ లక్షణాలతో HbA1c స్థాయి 6.6 కంటే ఎక్కువగా ఉంటే మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడం కూడా అవసరం. లేకపోతే చక్కెర స్థాయిలు ఇప్పుడు సాధారణంగా ఉన్నప్పటికీ ఆ తరువాత మధుమేహానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏం చేయాలి?

  • ప్రతిరోజూ 30 నిమిషాలు నడవండి.
  • రోజూ వ్యాయామం చేయండి.
  • చక్కెర, స్వీట్లు తినవద్దు.
  • ఎక్కువ ప్రోటీన్ తినండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.