Morning Body Aches: పొద్దున లేవగానే ఒళ్ళు నొప్పులు బాధిస్తున్నాయా..? దీనికి కారణాలేంటో తెలుసా..?

ఉదయం మీరు లేచిన వెంటనే శరీరం నొప్పి అనిపిస్తే దాన్ని మాములుగా తీసుకోకండి. ఈ సమస్యని కొంత మంది సాదారణంగా తీసుకుంటారు కానీ కొన్నిసార్లు ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా కూడా ఉంటుంది. నిద్రపోయిన తర్వాత శరీరం తాజాగా ఉండాలి కానీ ప్రతిరోజూ నొప్పి అనిపిస్తే అది శరీరంలో ఏదో తేడా జరుగుతోందని సూచిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అసలు కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం.

Morning Body Aches: పొద్దున లేవగానే ఒళ్ళు నొప్పులు బాధిస్తున్నాయా..? దీనికి కారణాలేంటో తెలుసా..?
Morning Body Aches

Updated on: May 29, 2025 | 6:12 PM

ఉదయం ఆరోగ్యంగా లేచి పనులు ప్రారంభించగలిగితే రోజు బాగా సాగుతుంది. కానీ ఉదయం నొప్పితో లేస్తే మనసు బాగుండదు. ఉదయం వచ్చే శరీర నొప్పి చిన్నదిగా అనిపించినా.. అది రోజంతా ప్రభావం చూపుతుంది. చాలా మంది ఉదయం శరీరం నొప్పిగా ఉందని ఫిర్యాదు చేస్తారు. అయితే ఎందుకు నొప్పిగా ఉందో వారికి స్పష్టంగా తెలియదు. ఈ సమస్యను గమనించకపోతే అది మరింత పెరిగే అవకాశం ఉంది.

రాత్రిపూట కొంత మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. ఇది ఆక్సిజన్ లోపానికి దారి తీస్తుంది. నిద్రలో శరీరానికి సరిపడా ఆక్సిజన్ లభించకపోతే ఉదయం లేచిన వెంటనే శరీర నొప్పి వస్తుంది. దీని వల్ల ఒళ్లంతా అలసటగా, బలహీనంగా అనిపించవచ్చు. ఇది గమనించాల్సిన ముఖ్యమైన కారణం.

మనం పడుకునే పరుపు కూడా శరీర నొప్పికి ప్రధాన కారణం కావొచ్చు. పరుపు చాలా పాతదిగా లేదా గట్టిగా ఉంటే.. అది శరీరానికి సరైన సపోర్ట్ ఇవ్వదు. దీని వల్ల నిద్రపోతున్నప్పుడు శరీర భాగాలపై ఒత్తిడి పడుతుంది. అలాంటి పరుపుపై పడుకుంటే ఉదయం లేవగానే నొప్పి వస్తుంది. పరుపు మార్చే వరకు ఈ సమస్య అలాగే ఉంటుంది.

ప్రతి ఒక్కరి నిద్రపోయే పద్ధతి వేరుగా ఉంటుంది. కొంతమంది తల ఎత్తి పడుకుంటే, మరికొంతమంది ఒక పక్కకు తిరిగి పడుకుంటారు. ఈ స్థితులలో శరీరం సరిగ్గా విశ్రాంతి తీసుకోలేకపోవడం వల్ల కొన్ని భాగాల్లో నొప్పి రావొచ్చు. మీ నిద్రపోయే పద్ధతిని మార్చుకోవడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీర భాగాల్లో మార్పులు జరుగుతాయి. కీళ్లలో తేమ తగ్గిపోవడం, చిన్న వయస్సులోనూ వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో కూడా నొప్పి వస్తుంది. శరీరానికి సరిపడా జాగ్రత్తలు తీసుకోకపోతే రోజూ ఉదయాన్నే నొప్పితో లేచే పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ సమస్యలు సాదారణంగా కనిపించే విషయాలు. కానీ ఏ సమస్య అయినా ఎక్కువ రోజులు ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇంట్లో తీసుకునే చిన్న జాగ్రత్తలు ఉపశమనం ఇస్తాయి కానీ శాశ్వత పరిష్కారం కావాలంటే నిపుణుడి సూచన తప్పనిసరి.