Loose Motions Control Tips: తీసుకునే ఆహారంలో ఏమాత్రం మార్పు వచ్చినా కడుపులో గందరగోళం మొదలవుంది. దీంతో ఇది కొన్నిసార్లు విరేచనాలకు కూడా దారి తీస్తుంది. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే విరేచనలు ఎంతకీ తగ్గకపోతే ఎక్కువ శాతం మంది ట్యాబ్లెట్ వేసుకుంటారు. అలా కాకుండా కొన్ని సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా కూడా విరేచనాలకు చెక్‌పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా? విరేచనాలకు అడ్డుకట్ట వేసే కొన్ని పద్ధతులు ఇప్పుడు చూద్దాం..
* నీటిలో అర టీ స్పూన్ తురిమిన అల్లం, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని 30 నిమిషాల పాటు మరిగించాలి. చివరకు మిగిలిన మిశ్రమాన్ని తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.
* తేనే, దాల్చిన చెక్క మిశ్రం కూడా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిలను వేసి బాగా కలిపి తీసుకోవాలి.
* అరటి పండు లేదా పెరుగులో దాల్చిన చెక్క పొడిని కొద్దిగా చల్లి తిన్నా మంచి ఫలితం ఉంటుంది.
* విరేచనాలు ఎంతకీ తగ్గని పరిస్థితుల్లో గడ్డ పెరుగు తినాలి. రోజులో 2 నుంచి 3 కప్పుల పెరుగు తింటే విరేచనాలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ నీళ్ల విరేచనాలకు అడ్డుకట్ట వేస్తాయి.
* గోరు వెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసి తాగినా ఫలితం ఉంటుంది.
* విరేచనాలు మరీ ఎక్కువగా ఉంటే.. ప్రతి 2 గంటలకు ఒక సారి బాగా మగ్గిన అరటి పండును తినాలి. అలాగే పెరుగు, అరటి పండు కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే విరేచనాలకు చెక్ పెట్టొచ్చు.
* ఎండిన అల్లం పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి, తేనెలను కొంత మొత్తంలో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.
Also Read: Fenugreek Seeds : మెంతి నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు..! ఈ 7 సమస్యలకు చక్కటి పరిష్కారం..
Gas Problems : గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఈ ఆహార పదార్థాలను తినడం మానుకోండి
Banana : గుర్తుంచుకోండి..! ఈ మూడు సమయాల్లో అరటిపండ్లు తినకూడదు..? ఎందుకంటే..