Heart Health Tips: గుండెకు హాని కలిగించే ఆహారాలు: ఆరోగ్యకరమైన శరీరం కోసం.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అదే సమయంలో తీవ్రమైన పరిస్థితులను నివారించడానికి హృదయ రోగులు.. గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, హృద్రోగులు కొన్ని పదార్థాలు తినకుండా ఉండాలని సూచిస్తున్నారు. హృద్రోగులు ఎలాంటి పదార్థాలకు దూరంగంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉప్పు: ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. కానీ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ప్రమాదకరం. ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. ఇది మీ గుండెకు హానికరం. అంతే కాదు ఉప్పు గుండె సంబంధిత సమస్యలను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు హార్ట్ పేషెంట్ అయితే పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోవాలి.
మైదా: మైదా శరీరానికి చాలా హానికరం. పిండిని తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. మైదాను ఆహారంలో అస్సలు తీసుకోవద్దు. శరీర భాగాలకు రక్తాన్ని రవాణా చేసే మార్గంలో కొలెస్ట్రాల్ జమ అవుతుంది. మరోవైపు, మీరు హార్ట్ పేషెంట్ అయితే బ్రెడ్, బర్గర్, చౌమీన్ మొదలైన మైదాతో చేసిన ఆహారాన్ని తినవద్దు.
టీ కాఫీ: టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. హృద్రోగులు టీ, కాఫీ తాగడానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటి వినియోగం రక్తపోటును అమాంతం పెంచుతుంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. అంతే కాకుండా హృద్రోగులు శీతల పానీయాలకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం