Heart Attack: ఇటీవల కాలంలో గుండెపోటుతు మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. గుండెపోటు ఎప్పుడు వస్తుందో? తెలియని పరిస్థితి. యువకులను సైతం వదలడం లేదు. ఆరోగ్యంగా ఉన్నారనుకున్న సెలబ్రెటీలు, క్రికెట్ ప్లేయర్లు దీనిబారిన పడుతున్నారు. తాజాగా పుణె వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఓ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటివరకూ తమతో ఆడుతున్న ఆటగాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు. కాసేపటికే ఎడమవైపు ఛాతీలో నొప్పిగా ఉందంటూ సహచరులకు చెబుతూ కుప్పకూలాడు. అయితే గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. ఇలా యువతలో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో యువతలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.. దాని నుండి రక్షించువడం ఎలా అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
చురుకుగా ఉండండి: మీరు ఎంత బిజీగా ఉన్న చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇంట్లోనే ఉండి వ్యాయమం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. యోగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసికంగా కూడా ప్రశాంతతను అందిస్తుంది. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తినండి. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినండి, ఎక్కువ నీరు తాగండి. బయటి ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి