Health Tips: రాత్రి ఈ సమయాల్లో భోజనం చేస్తున్నారా..? సమస్యల్లో పడిపోయినట్లే..!

|

Oct 31, 2022 | 4:24 AM

మన రోగాల బారిన పడడానికి ఎన్నో కారణాలుంటాయి. ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మానసి ఒత్తిడి ఇలా తదితర కారణాల రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పుడున్న జీవనశైలి కారణంగా చాలా మందరికి..

Health Tips: రాత్రి ఈ సమయాల్లో భోజనం చేస్తున్నారా..? సమస్యల్లో పడిపోయినట్లే..!
Eating
Follow us on

మన రోగాల బారిన పడడానికి ఎన్నో కారణాలుంటాయి. ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మానసి ఒత్తిడి ఇలా తదితర కారణాల రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పుడున్న జీవనశైలి కారణంగా చాలా మందరికి రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. జీవిన విధానంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇక చాలా మంది తినే ఆహారం విషయంలో సమయ సందర్భాలు పాటించరు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరైన నిద్రపోవాలని, లేకపోతే ఒబిసిటి, హృద్రోగ సమస్యలతో బాధపడటం తప్పదని సూచిస్తున్నారు.రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

  1. ఎక్కువగా రాత్రిపూట 9 గంటల తర్వాత భోజనం చేసే వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. అందుకే రాత్రి 9 గంటల లోపే భోజనం చేయాలని సూచిస్తున్నారు.
  2. రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం వల్ల డయాబెటిస్‌ -2, గుండె జబ్బులు తప్పవంటున్నారు.
  3. రాత్రి పడుకునే సమయానికి మూడు గంటల ముందు భోజనం చేయాలి.
  4. భోజనం విషయంలో సరైన సమయాలు పాటించాలని, లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇలా రాత్రి సమయంలో భోజనం ఆలస్యంగా చేసినట్లయితే ఎన్నో రోగాలు దరిచేరే అవకాశం ఉంది. అందుకే రాత్రి సమయంలో భోజనం చేసే ముందు సమయ వేళలు పాటించాలని సూచిస్తున్నారు.
  7. ప్రస్తుత కాలంలో ఆలస్యంగా భోజనం చేసే వారి చాలా మంది ఉంటారు. రాత్రి సమయంలో భోజనంచేసే వారు దాదాపు 10 గంటల తర్వాత చేస్తుంటారు. కొందరేమో రాత్రి 11లకు భోజనం చేస్తుంటారు. అలా కాకుండా నిద్రకు కనీసం మూడు గంటల ముందైనా భోజనం చేస్తే చాలాంటున్నారు వైద్య నిపుణులు.
  8. రాత్రి సమయాల్లో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, ఆహార సమయ వేళల్లో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం