Health Tips: ఆడ పిల్లలు కౌమరానికి చేరుకునే దశ (14-18) ఎంతో ముఖ్యం. ఈ సమయంలో వారిలో శారీరకంగా, మానసింగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వయసులో అనేక అనుమానాలు కూడా ఉంటాయి. మరి కొందరిలో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. వారిలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయుకండా వైద్యులను సంప్రదించడం ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. చిన్నపిల్లలు కాదు కాబట్టి.. పిల్లల డాక్టరు దగ్గరికి తీసుకెళ్లలేరు. అలాగే మరీ పెద్దవాళ్లు కాలేదు కాబట్టి.. గైనకాలజిస్టును సంప్రదించ లేరు. ఈ దశలో ఉన్న పిల్లలకు ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎలాంటి వైద్యులను సంప్రదించాలనేదానిపై నిపుణులు సలహాలు ఇస్తున్నారు.
గైనకాలజిస్టు..
☛ నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు.
☛ లైంగిక వ్యవస్థ విషయంలో ఇతర ఇబ్బందులు గురవడం.
☛ 14 సంవత్సరాలు నిండిన ఆడ పిల్లల్లో రొమ్ము పరిమాణంలో మార్పులు రాకపోతే.
☛ యుక్త వయసు వచ్చినా రుతుక్రమం మొదలు కాకపోవడంతో, ఒక వేళ వచ్చినా ఏవైనా సమస్యల ఉన్నవారికి.
☛ శృంగార, గర్భదారణ, కుటుంబ నియంత్రణ వంటి పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, నేరుగా చెప్పలేని సందర్భంలో గైనకాలజిస్టును సంప్రదించవచ్చు.
☛ రొమ్ము, గర్భాశయం, అండాశయం మొదలైన వాటిపై అవగాహన కోసం.
పిల్లల వైద్యులు:
☛ చాలా కాలంగా యాంటీ బయాటిక్స్ వాడాల్సిన ఉన్న చెవి ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత వ్యాధులు, గొంతునొప్పి వంటివి.
☛ ఈ దశలో ఉన్నవారిని ఎలాంటి సమస్యలకు పిల్లల వైద్యులను సంప్రదించాలి.
☛ దీర్ఘకాలంగా వేధిస్తున్న డయాబెటిస్, అధిక రక్తపోటు ఒంటినొప్పులకు.
☛ గాయాలు, పోషక లోపాలు తదితర సమస్యలకు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి