Watermelon Seeds Benefits: వేసవి కాలం మొదలైంది. కొన్ని రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సీజనల్ పండ్లను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి చాలామంచిది. అలాంటి వేసవి పండ్లల్లో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పుచ్చకాయతో పాటు, దాని విత్తనాలు కూడా చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే అనేక లక్షణాలు పుచ్చకాయ గింజల్లో ఉన్నాయి. విటమిన్ ఎ, సి, ఇ, కె, నియాసిన్, జింక్, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఈ పోషకాల వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. కావున ఈ వేసవిలో మీరు పుచ్చకాయతో పాటు దాని విత్తనాలను కూడా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మీ శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. పుచ్చకాయ గింజల వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తపోటును తగ్గిస్తుంది: పుచ్చకాయ గింజల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటును తగ్గించవచ్చు. ఇవి తినడం వల్ల గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది: పుచ్చకాయ గింజల్లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ కళ్ళకు చాలా మంచివి. పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనితో పాటు, కంటి చూపును రక్షించడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
గర్భధారణలో: పుచ్చకాయ గింజల్లో ఫోలేట్ పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుండి అదనపు సోడియంను తొలగించి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. గర్భిణీలు హైడ్రెట్ గా ఉండేలా సహాయపడుతుంది. అయితే.. ప్రెగ్నెన్సీలో మాత్రం నిపుణుల సలహా మేరకు మాత్రమే తినాలి.
రోగనిరోధక శక్తి: మీ ఆహారంలో పుచ్చకాయ గింజలను చేర్చుకోవడం ద్వారా మీ శరీరానికి విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా రక్తంలోని తెల్లరక్తకణాల కణాలను పెంచవచ్చు. రక్తంలో తెల్లరక్తకణాలు పెరగడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
గ్యాస్ సమస్యలు దూరం: పుచ్చకాయ గింజలు తటస్థ pH స్థాయిలను కలిగి ఉంటాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేయడానికి మీరు పుచ్చకాయ గింజలను తినడం మంచిది.
ఒత్తిడి – ఆందోళనను తగ్గిస్తుంది: పుచ్చకాయ గింజలను తీసుకోవడం వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది మీ మెదడును ప్రశాంతపరిచి ఒత్తిడి తగ్గిస్తుంది. పుచ్చకాయ గింజలను తీసుకోవడం ద్వారా క్రమంగా ఆందోళన సమస్యను అధిగమించవచ్చు.
(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)
Also Read: