Health Tips: కొంతమంది తరచూ గోళ్లు కొరుకుతుంటారు. ఒక్కోసారి వారికి తెలియకుండానే చేతివేళ్లు నోటి దగ్గరికి వెళుతుంటాయి. వాస్తవానికి గోళ్లు కొరికే అలవాటు సాధారణంగా చిన్నతనం నుంచి మొదలవుతుంది. ఈ అలవాటు కొన్నిసార్లు ఆందోళన లేదా ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. దీనిని విస్మరించకుంటే యుక్తవయస్సు నుంచి వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది. అయితే ఏ వయసు వారైనా గోళ్లు కొరకడం అనేది చాలా చెడ్డ అలవాటు. అంతేకాదు ఆరోగ్యానికి హానికరం కూడా. మీ పళ్లతో తరచుగా గోళ్లను కొరికితే గోళ్ల చుట్టూ ఉన్న చర్మంలో నొప్పి వస్తుంది. గోళ్లు పెరిగే కణజాలం దెబ్బతింటుంది. గోళ్లు కొరికే అలవాటు వల్ల చేతుల మురికి పొట్ట లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అలవాటును వదిలించుకోవడానికి ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఈ అలవాటుని త్వరగా మానుకోవచ్చు.
1) మీ గోళ్లను చిన్నగా కట్ చేయండి. గోళ్లు పొట్టిగా ఉంటే నోటికి అందకుండా ఉంటాయి. అయితే గోర్లు త్వరగా పెరుగుతాయి. కాబట్టి తరచుగా కట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే గోళ్లు కొరకడంపై ధ్యాస ఉండదు.
2) గోళ్లు కొరికే అలవాటును నివారించడానికి గోళ్లపై నెయిల్‌పెయింట్‌ను వేయవచ్చు. అప్పుడు మీరు గోళ్లని కొరికినప్పుడు దాని చెడు రుచి మిమ్మల్ని అలా చేయకుండా ఆపుతుంది.
3) గోళ్లు కొరకకుండా ఉండాలంటే కొన్ని రోజులు చేతి రుమాలుని వేళ్లకి చుట్టండి. అప్పుడు మీరు ఈ అలవాటు గురించి మరిచిపోయి వేరే పనిమీదకి ధ్యాస మళ్లిస్తారు.
4. అన్నింటికంటే ముఖ్యం గోళ్లు కొరకడం చాలా చెడ్డ అలవాటు. అందరి ముందు చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకే మీరు మీ మనస్సుని మళ్లించండి. తద్వారా కొద్దిరోజుల్లోనే గోళ్లు కొరకడం మానేస్తారు.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.