Swollen Hands: చాలా మంది రాత్రిపూట నిద్రపోయి ఉదయం లేవగానే చేతులు, కాళ్లు వాచిపోతుంటారు. నిజానికి, ఉదయం నిద్రలేచిన తర్వాత చేతులు, కాళ్ళ వాపు అనేక తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఈ పరిస్థితికి కారణాలు గుర్తించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కావున, సమస్య జఠిలం కాకముందే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. మరి చేతుల వాపు.. ఎలాంటి వ్యాధులకు దారి తీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1. చాలా కాలంగా కీళ్లనొప్పులు వంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే చేతి వాపు అసలు కారణం కావచ్చు. దానికి సకాలంలో చికిత్స తీసుకోవడం వలన ప్రమాదం నుంచి బయటపడొచ్చు. కావున సరైన సమయానికి వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి.
2. గర్భధారణ సమయంలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలు ఉదయం మేల్కొన్నప్పుడు.. చేతులు, కాళ్ళలో వాపు కనిపిస్తుంది. కాళ్లు, చేతులు, కీళ్లలో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ సమస్య కనిపించవచ్చు. అయితే, భయపడాల్సిన పని లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్త్రీలు బరువు పెరిగినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. బిడ్డ పుట్టిన తరువాత ఈ సమస్య ఉండదు. అయితే, చేతిలో వాపు వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
3. కిడ్నీ సమస్యకు కూడా చేతి వాపు సూచనగా కనిపిస్తుంది. కిడ్నీ మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది నిర్విషీకరణకు పని చేస్తుంది. దీని కారణంగా కిడ్నీలో ఇతర రకాల సమస్యలు కూడా వస్తాయి. అందుకే సమయానికి వైద్యుల సలహా తీసుకుని, చికిత్స పొందాలి. తద్వారా వ్యాధి నుండి బయటపడవచ్చు.
4. చాలా మంది సరైన ఆహారం తనికుండా ఉండటంతో పాటు.. మరింత రుచి కోసం తమ ఆహారంలో ఎక్కువ ఉప్పును ఉపయోగిస్తారు. కానీ, దాని వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో వారు గుర్తించరు. అధిక ఉప్పు కారణంగా చేతులు, కాళ్లలో తీవ్రమైన వాపు, నొప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..