Health Tips: అలివ్‌ ఆయిల్‌లో వేయించిన వెల్లుల్లిని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు

|

May 01, 2022 | 1:00 PM

Health Tips: ఆలివ్ (Olive) ఆయిల్, వెల్లుల్లిని కలిపి తినడానికి దాదాపు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఆలివ్ నూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను నానబెట్టి, ఆపై వాటిని తినండి..

Health Tips: అలివ్‌ ఆయిల్‌లో వేయించిన వెల్లుల్లిని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు
Follow us on

Health Tips: ఆలివ్ (Olive) ఆయిల్, వెల్లుల్లిని కలిపి తినడానికి దాదాపు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఆలివ్ నూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను నానబెట్టి, ఆపై వాటిని తినండి. మరొక మార్గం ఏమిటంటే వెల్లుల్లిని ఆలివ్ నూనెలో వేయించి, ఆపై తినడం. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా పద్ధతిని ఉపయోగించవచ్చు.

ఆలివ్ నూనె – వెల్లుల్లి ప్రయోజనాలు:

  1. శక్తి పెంచడానికి సహాయం చేస్తుంది: ఆలివ్ నూనెలో వెల్లుల్లిని నానబెట్టడం లేదా వేయించడం వల్ల మీ శరీరం శక్తిని పెంచుతుంది. శరీరంలోని వివిధ భాగాల పనితీరును మెరుగు పరుస్తుంది. అలాంటప్పుడు మీరు వ్యాయామం, వాకింగ్‌ చేసే సమయంలో శక్తిని కోల్పోకుండా ఉంటారు.
  2. మైండ్ బూస్టర్: మీరు తరచుగా బలహీనత, బద్ధకంగా ఉంటే అటువంటి సందర్భాలలో ఆలివ్ నూనెలో ఉన్న వెల్లుల్లిని తీసుకోవడం మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఉదయాన్నే వేగంగా పని చేయడానికి, ఆలోచన శక్తిని పెంచేలా చేస్తుంది. మెదడు పనితీరును మరింతగా మెరుగు పరుస్తుంది. మీ మెదడు శక్తిని పెంచుకోవాలంటే ప్రతిరోజూ ఉదయం ఆలివ్ నూనెలో నానబెట్టిన వెల్లుల్లి రెబ్బలను తినడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
  3. కీళ్ల నొప్పులకు ఔషధం: ఆలివ్ నూనెలో నానబెట్టిన వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఎముకల నొప్పిని తగ్గించి, వాపును నివారిస్తాయి. అంతే కాకుండా ఆలివ్ ఆయిల్‌లో నానబెట్టిన వెల్లుల్లిని తినడం వల్ల చాలా కాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
  4. అలర్జీలకు ఉపయోగపడుతుంది: అలర్జీని తగ్గించుకోవడానికి మీరు ఆలివ్ ఆయిల్, వెల్లుల్లిని ఉపయోగించవచ్చు. ఆలివ్ ఆయిల్‌లో కలిపిన వెల్లుల్లి యాంటిహిస్టామైన్‌గా పనిచేసి అలర్జీలను తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం తరచుగా తుమ్ము సమస్యలు ఉన్నవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

(గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

Source:

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Diabetes Control Tips: మధుమేహాన్ని నియంత్రించాలంటే ఈ పదార్థాలను పాలలో కలుపుకొని తాగాలి..!

Bed Tea Side Effects: నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..? అయితే.. మీరు ప్రమాదంలో పడినట్లే..