Weird Food Combinations: మన ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెయింటెయిన్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయిలో విటమిన్ సి కాకుండా ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ ఇ, ఎ, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ ఎ కంటి చూపును పదును పెట్టడంలో సహాయపడుతుంది. బొప్పాయి దాని ఉత్తమ వనరుగా పరిగణించబడుతుంది. బొప్పాయిలో పపైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతగానో ఉపయోకరంగా ఉంటుంది. బొప్పాయి అనేక ప్రయోజనాలను కలిగి ఉండటమే కాకుండా, ఇది చాలా నష్టాలు కూడా కలిగిస్తుంది. బొప్పాయి తిన్న తర్వాత మీరు తినకూడని కొన్ని ఆహారాల కూడా ఉన్నాయి. అవి తెలుసుకోవడం ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
సిట్రస్ పండ్లు: తరచుగా చాలా మంది సిట్రస్ పండ్లు, బొప్పాయిని ఫ్రూట్ చాట్‌లో కలిపి తింటుంటారు. ఇలా కూడా తినకూడదు. అరగంట గ్యాప్ తీసుకోవాలి. అవి కడుపు లోపల ఒక రకమైన రసాయన ప్రతిచర్యను చేస్తుంది.
బొప్పాయి తర్వాత పెరుగు: చాలా సార్లు ఆరోగ్యంగా ఉండటానికి లేదా ఫిట్‌గా ఉండటానికి కొన్ని రకాల పదార్థాలను కలిపి తింటుంటారు. ఇవి వారికి ప్రయోజనం కలిగించే బదులు వారికి హాని చేస్తుంది. పెరుగు, బొప్పాయి విషయంలో కూడా అదే పరిస్థితి. ఈ రెండింటి కలయిక హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి తిన్న అరగంట వరకు తినకూడదు. ఈ రెండింటి ప్రభావం వేరుగా ఉంటుందని. వీటిని కలిపి తింటే శరీరానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు.
నిమ్మకాయ, బొప్పాయి: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు బొప్పాయితో నిమ్మరసం తీసుకుంటే ఇకపై ఈ అలవాటును మానుకోవడం మంచిది. మీరు చేసిన ఈ పొరపాటు మిమ్మల్ని రక్తహీనత రోగిని చేస్తుంది. ఎందుకంటే ఈ ఆహార కలయిక శరీరంలో హేమోగ్లోబిన్ స్థాయిని మరింత తగ్గిపోయే అవాకశం ఉంది. మీరు సలాడ్‌లో బొప్పాయి తింటుంటే అందులో నిమ్మరసం కలపడం మర్చిపోవద్దు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..