Mustard Side Effects: ఆవాలను అతిగా వినియోగిస్తున్నారా? ఈ 4 వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది..

|

Mar 28, 2023 | 8:10 AM

మన దేశంలో ఆవాలు వినియోగించని వారు ఉండరు. ప్రతి వంటింట్లో అవాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇది లేకుండా భారతీయ వంటకాల రుచి అసంపూర్ణంగా ఉంటుంది. అద్భుతమైన రుచి, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా.. ఆవాలను ప్రజలు వివిధ మార్గాల్లో వినియోగిస్తారు. పేస్ట్ రూపంలోనో, నూనె రూపంలోనో వినియోగిస్తారు.

Mustard Side Effects: ఆవాలను అతిగా వినియోగిస్తున్నారా? ఈ 4 వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది..
Mustard
Follow us on

మన దేశంలో ఆవాలు వినియోగించని వారు ఉండరు. ప్రతి వంటింట్లో అవాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇది లేకుండా భారతీయ వంటకాల రుచి అసంపూర్ణంగా ఉంటుంది. అద్భుతమైన రుచి, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా.. ఆవాలను ప్రజలు వివిధ మార్గాల్లో వినియోగిస్తారు. పేస్ట్ రూపంలోనో, నూనె రూపంలోనో వినియోగిస్తారు. అయితే, ఆవపిండిలో ఐరన్, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, క్యాల్షియం వంటి ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలంగా పేర్కొంటారు. అంతేకాదు.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఆవాలు తీసుకోవడం వల్ల కండరాలు, ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

ఆవాల దుష్ప్రభావాలు..

ఆవాలు అనేక వ్యాధులను నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక శారీరక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆవపిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

1. అలెర్జీలు: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. ప్రతి సంవత్సరం సుమారు 30,000 మంది అమెరికన్లు తీవ్రమైన ఆహార అలెర్జీల కారణంగా ఆసుపత్రి పాలవుతున్నారు. వీరిలో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆవపిండి అలెర్జీ అత్యంత తీవ్రమైన అలెర్జీలలో ఒకటిగా పరిగణించబడుతుందని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే దీన్ని తినడం వల్ల హిస్టమిన్ పెరిగి అనాఫిలాక్టిక్ షాక్ కూడా వస్తుంది.

ఆవాలు అలెర్జీ..

1. చర్మంపై దద్దుర్లు.

2. ఊపిరి ఆడకపోవడం, గురక.

3. తల తిరగడం.

4. వికారం, వాంతులు.

5. ముఖం, కళ్ళు, గొంతు వాపు.

2. గుండె జబ్బులు: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆవాల నూనెలో అధిక స్థాయి ఎరూసిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఆవపిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మయోకార్డియల్ లిపిడోసిస్ పరిస్థితికి దారితీయవచ్చు. దీనిలో ట్రైగ్లిజరైడ్స్ ఏర్పడటం వలన గుండె కండరాల మయోకార్డియల్ ఫైబర్‌లలో ఫైబ్రోటిక్ మచ్చలు ఏర్పడతాయి. ఈ సమస్య వల్ల గుండె కండరాలు భారీగా దెబ్బతింటాయని, గుండె ఆగిపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

3. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఆవనూనెలో ఉండే ఎరుసిక్ యాసిడ్ ఊపిరితిత్తుల సమస్యలను కూడా కలిగిస్తుంది. ఆవాలు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆవాల నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఇది ప్రమాదకరమైన వ్యాధి.

4. ప్రెగ్నెన్సీలో కష్టాలు: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భిణీ స్త్రీలు ఆవాల నూనె, నల్ల ఆవాలు ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే అవి కొన్ని రసాయన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి పిల్లలకి హాని చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం.. ఆవాలలో ఉండే రసాయనాలు గర్భస్రావానికి కారణం అవుతుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణంగా ప్రయోజనాలను ఉద్దేశించినవే. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..