Night Leg Pain: ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఏ సమస్య వేధిస్తుందో చెప్పడం కష్టం. అయితే, చాలా మంది నిద్రపోతున్నప్పుడు కాళ్లు తిమ్మిర్లు, మోకాళ్లలో అకస్మాత్తుగా మెలితిప్పినట్లుగా తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రిపూట కాళ్లలో నొప్పి వస్తే పెయిన్ కిల్లర్స్ వాడటం తప్ప మరో మార్గం లేదు. మందుల వల్ల తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. కానీ, కంటిన్యూగా మందులు వాడటం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సమస్యలకు హోమ్ రెమిడీస్ సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఆయిల్ మసాజ్..
కాళ్లు, పాదాలలో నొప్పి ఉంటే.. నూనెను కాస్త వేడి చేసి మసాజ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. మెదడు నుంచి రిలాక్సింగ్ హార్మోన్లు కూడా విడుదలవుతాయి. దీని వల్ల నొప్పి తగ్గుతుంది.
స్లీపింగ్ పొజిషన్ మార్చుకోవాలి..
చాలాసార్లు నిద్రపోయే విధానం కూడా కాళ్లలో నొప్పికి కారణం అవుతుంది. ఒక భంగిమలో నిద్రపోవడం వలన నొప్పి తీవ్రం అవుతుంది. అందుకే అప్పుడప్పుడు కాలి కండరాలను సాగదీయాలి. అవసరమైతే స్థలాన్ని కూడా మారవచ్చు.
ఐస్ క్యూబ్ పెట్టుకోవడం..
చాలా మంది నొప్పులు ఉంటే వేడి వేడి నీటితో మర్దన చేస్తుంటారు. కానీ, అలా చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నొప్పి ఉన్న చోట చల్లని ఐస్ క్యూబ్‌లతో మర్దన చేయాలి. కోల్డ్ కంప్రెస్ నొప్పిని తగ్గిస్తుంది.
రక్త పరీక్ష చేయించుకోవాలి..
కాళ్లలో నొప్పి తరచుగా ఉంటే రక్త పరీక్ష చేయించుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యుడికి చూపించుకోవాలి. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ ఈ సమస్యను కలిగిస్తుంది. ఆర్థరైటిస్ కూడా అనేక సమస్యలకు దారి తీస్తుంది. కావున నిర్లక్ష్యం చేయొద్దు. వైద్యుల సలహా మేరకు అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..