Papaya Benefits: నోరూరించే బొప్పాయి పండులో పోషకాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

చూడగానే నోరూరించే బొప్పాయి పండులో పోషకాలూ పుష్కలంగానే ఉంటాయి. అన్నిరకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రిబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది..

Papaya Benefits: నోరూరించే బొప్పాయి పండులో పోషకాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Papaya Benefits
Follow us

|

Updated on: May 19, 2023 | 8:59 PM

చూడగానే నోరూరించే బొప్పాయి పండులో పోషకాలూ పుష్కలంగానే ఉంటాయి. అన్నిరకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రిబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది. హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.

రోగ నిరోధక శక్తి..

100 గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్- సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

ఉపయోగాలు…

  1. బొప్పాయి మలబద్ధకాన్ని పోగొట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
  2. తిన్న ఆహారం వెంటనే ఆరిగేలా చేస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. టీబీని నివారిస్తుంది.
  5. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
  6. రక్తంలోని దోషాలను నివారిస్తుంది.
  7. రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది.
  8. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
  9. కడుపులోని యాసిడ్స్‌ను కంట్రోల్ చేస్తుంది.

జీర్ణక్రీయ వేగవంతం…

బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి కాయ ముక్కలను వేస్తారు.

బ్రేక్ ఫాస్ట్‌గా బొప్పాయి…

  1. బొప్పాయి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా మంచిది.
  2. బొప్పాయిపండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
  3. బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయ సంబంధ జబ్బులు నయం చేస్తుంది.
  4. నీళ్ల విరేచనాలకు.. నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేయవచ్చు. అందుకోసం బొప్పాయి గింజలు రెండు భాగాలు, ఒక భాగం శొంఠి, కొద్దిగా ఉప్పు కలిపి చూర్ణంగా చేయాలి. ఈ చూర్ణాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేగాకుండా పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది.
  5. బొప్పాయి పాలతో ఎంతో మేలు: 10 గ్రాముల బొప్పాయి పాలను చెరకు రసంతో కలిపి తీసుకుంటే పచ్చకామెర్లు నయమవుతాయి. బొప్పాయి పాలలో కొంచెం తేనె కలిపి ఇస్తే కడుపులో నులి పురుగులు పడిపోతాయి. చిన్నపిల్లలకు అరస్పూను ఇస్తే సరిపోతుంది. తేనె కలిపిన పాలకు రెట్టింపుగా వేడి నీరు కలిపి చల్లారిన తర్వాత మాత్రమే తాగించాలి.
  6. బొప్పాయి ఆకులతో వైద్యం: బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి తాగించాలి. దీనివల్ల హైఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఈ నీటికి గుండెనొప్పిని కూడా తగ్గించే గుణం ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బొప్పాయి వాడుతుండాలి. ఇక మధుమేహం ఉన్నవారికి అద్బుతమైన ఉపయోగం. ఇది షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది.
  7. బీపీ తగ్గిస్తుంది: రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి.
  8. ఔషధంగా.. అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ల విరేచనాలను వెంటనే అరికడుతుంది.
  9. వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భుజించడం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తాగటం, మానసిక ఒత్తిడి, మితిమీరిన టెన్షన్ వంటివి జీర్ణకోశాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు అమోఘంగా పనిచేస్తుంది.
  10. బొప్పాయి కాయలను కూరగా వండుకుని రెండు వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి.
  11. బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  12. ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది.
  13. సౌందర్య సాధనంగా.. బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది.
  14. బ్యూటీక్రీమ్‌లు, బ్యూటీ లోషన్లలో పండును ఎక్కువగా వాడతారు.
  15. బొప్పాయి చెట్టు పాలు చర్మ సంరక్షణకు లోషన్‌గా ఉపయోగపడుతాయి.
  16. బొప్పాయి కాయలను బాగా ఎండబెట్టి, పొడిగా మార్చి, ఉప్పు కలుపుకుని తింటే చర్మం అందంగా తయారవుతుంది.
  17. బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్‌లా నెల రోజులు చేసుకుంటే నల్లదనం తగ్గి రంగు తేలుతుంది.
  18. బొప్పాయి పండు, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మేలు చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఈ అంశాలను అనుసరించే ముందు వైద్యులను సంప్రదించండి.)

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్... గిరిప్రదక్షిణకు టూరిజం స్పెషల్ ప
భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్... గిరిప్రదక్షిణకు టూరిజం స్పెషల్ ప
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!