కొంతమంది బంగాళాదుంపలను తినడం మంచిది కాదు అని అంటుంటారు. కానీ బంగాళాదుంపల మన ఆరోగ్యానికి ఎలాంటి చెడు చేయదట.. యునైటెడ్ స్టేట్స్‌లోని బోస్టన్ విశ్వవిద్యాలయంలోని జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ పరిశోధకులు ఈ విషయాన్ని చెప్తున్నారు. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల తెల్ల బంగాళాదుంపలను తినడం వల్ల మన శరీరానికి ఎటువంటి హాని జరగదని పరిశోధనలో తేలింది. ఇది రక్తపోటు, డైస్లిపిడెమియా వంటి ఆరోగ్య సమస్యలతో నేరుగా సంబంధం కలిగి ఉండదు. అదనంగా, వేయించిన బంగాళాదుంపలను తినేవారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం కూడా తక్కువేనట. అయితే రెడ్ మీట్‌కు బదులుగా బంగాళాదుంపలను తినడం వల్ల ఈ ప్రమాదం తగ్గుతుందని కనుగొనబడింది. అలా చేయడం ద్వారా టైప్ -2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేసే అవకాశం 24 శాతం తక్కువగా ఉంటుంది అలాగే ట్రైగ్లిజరైడ్‌లను పెంచే అవకాశం 26 శాతం తక్కువగా ఉంటుందట
బంగాళదుంపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే.. బంగాళదుంపలు మధుమేహం, అధిక రక్తపోటు లేదా ట్రైగ్లిజరైడ్స్ ప్రమాదాన్ని పెంచవు ఎందుకంటే బంగాళదుంపలు ప్రాసెస్ చేయని ఆహారం. బంగాళాదుంప అనేది అధిక నాణ్యత కలిగిన పిండి పదార్థాలు అదేవిదంగా ఇది ఫైబర్‌తో కూడిన కూరగాయ. ఇక బంగాళదుంపలో కండరాలు, గుండె, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తగినంత పొటాషియం ఉంటుంది. అయితే ఈ మొలకెత్తిన బంగాళదుంపలు శరీరానికి హానికలిగితాయట.
ఇక బంగాళదుంపలో విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు మరియు ఫైబర్ ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. 100 గ్రాముల బంగాళదుంపలో 78 కేలరీలు మాత్రమే ఉంటాయి మరియు కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. అదనంగా, బంగాళదుంపలు కూడా పొటాషియం కలిగి ఉంటాయి కాబట్టి బంగాళాదుంప తింటే బరువు తగ్గుతారట.