Health Tips: ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని ఆరోగ్య చిట్కాల వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. ఇక అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్ ఫుడ్‌గా చెప్పుకొనే చియా సీడ్స్. వీటికి ఎంతో ఆదరణ ఉంది. ప్లాంట్ ఆధారిత ప్రొటీన్స్‌కు మంచి పేరున్న చియా గింజలకు మించింది లేవు. బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని డైట్‌లో భాగం చేసుకోవచ్చు. శాకాహారుల ప్రొటీన్ అవసరాలను తీర్చడంలో చియా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. 28 గ్రాముల చియా సీడ్స్‌లో 5.6 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. శరీరానికి కావాల్సిన ప్రొటీన్ చియా సీడ్స్‌లో ఉంటాయి. అయితే చియా విత్తనాలను నానబెట్టి కూడా తినొచ్చున. చియా విత్తనాలను సాధారణంగా తినవచ్చు.
ఎముకలు, కండరాలు పటిష్టం:
చియా గింజలు ఎముకలు, కండరాల పటిష్టానికి, అలాగే ఎదుగుదలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. చియా సీడ్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంతో మెదడు ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే 28 గ్రాముల చియా సీడ్స్‌లో 11.2 గ్రాముల ఫైబర్ ఉండటంతో మలబద్దకాన్ని నివారించడంతో పాటు మరెన్నో ఉపయోగాలున్నాయి. మెటబాలిజం మెరుగుదల, జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది.
(గమనిక- ఈ వివరాలను ఆరోగ్య నిపుణుల వివరాల ప్రకారం అందిస్తున్నాము. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏమైనా సమస్యలుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించండి)
ఇవి కూడా చదవండి