నేటి బిజీ లైఫ్‌లో ప్రతి మనిషికి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, అలసట కారణంగా కొన్నిసార్లు శరీరం సహకరించదు. సాధారణంగా రోజంతా పనిచేసి రాత్రి పడుకుని ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మెడ, శరీరంలోని వివిధ భాగాలల్లో నొప్పి కనిపిస్తుంది. ఇంకొందరికి నిద్రలో లేదా నిద్ర లేచిన తర్వాత శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపునులు చెబుతున్నారు. మరి ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
నిద్ర లేచిన తర్వాత శరీరంలో నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. నిద్ర లేకపోవడం, అధిక శారీరక శ్రమ, శ్రమ లేకపోవడం, శారీరక బలహీనత వల్ల కూడా పెయిన్స్ వస్తాయని చెబుతున్నారు. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలో పోషకాహార లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు నిపుణులు.
నిద్ర లేచిన తర్వాత బాడీ పెయిన్స్ వేధిస్తున్నట్లయితే.. మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. కండరాలు, ఎముకలు, జీర్ణక్రియ, శరీరంలో రక్తం లకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని, పాలు, పెరుగు, మజ్జిగ, సోయాబీన్స్, పప్పులను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా స్ట్రెచింగ్, యోగా, మార్నింగ్ వాక్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.
వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల అలసట దూరమవుతుంది. దీని కారణంగా మీ కండరాలు ఒత్తిడి దూరమవుతుంది. వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల రిఫ్రెష్‌గా ఉంటుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించి, వారి సూచనలకు అనుగుణంగా చికిత్స పొందడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..