Clove Benefits: ప్రతిరోజూ ఉదయాన్నే లవంగం తింటే ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.. వివరాలివే..

|

Sep 21, 2022 | 4:06 PM

Clove Benefits: మసాలాదినుసులలో రారాజు లవంగం. లవంగాలు లేకుండా ఏ వంటకం ఉండదు. ప్రతీ భారతీయుడి వంటింట్లో లవంగం ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Clove Benefits: ప్రతిరోజూ ఉదయాన్నే లవంగం తింటే ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.. వివరాలివే..
Cloves For Diabetes
Follow us on

Clove Benefits: మసాలాదినుసులలో రారాజు లవంగం. లవంగాలు లేకుండా ఏ వంటకం ఉండదు. ప్రతీ భారతీయుడి వంటింట్లో లవంగం ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎండబెట్టి పూల మొగ్గల నుంచి తయారయ్యే ఈ లవంగం వంటకాలకు గుమగుమలాడే సువాలనలను అందిస్తుంది. కూరలు, బేకరీ ఐటెమ్స్, సూప్‌లు, మాంసం, బిర్యానీ ఇలా చెప్పుకుంటూ పోతే దీనిని వినియోగించే ఆహారాలు చాంతాడంత లిస్ట్ ఉంది. అయితే, లవంగాలు వంటకాలకు రుచిని మాత్రమే కాదు.. ఆయుర్వేదంలో ఔషధాలుగానూ ఉపయోగిస్తారు. ఎందుకంటే.. ఇదే అనేక రకాల ఆనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి నివారణిగా, జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. అలాగే శ్వాసకోస సమస్యలను సైతం నివారిస్తుంది. ఇంకా ఈ లవంగాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అద్భుతమైన ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..

లవంగం కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హెపటైటిస్ సమస్యను తగ్గిస్తుంది. కొత్త కణాల పెరుగుదల, కాలేయ నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది. ఇందులోని థైమోల్, యూజినాల్ వంటి క్రియాశీల సమ్మేళనాల కారణంగా రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్లడ్ షుగర్‌ కంట్రోల్‌లో ఉంచుతుంది..

ఖాళీ కడుపుతో చిటికెడు లవంగాల పొడిని తీసుకోవడం వలన డయాబెటిక్ పేషెంట్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. బీటా సెల్ పనితీరును ప్రోత్సహిస్తుంది.

వికారం తగ్గుతుంది..

మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడేవారు లవంగాలను ఖాళీ కడుపుతో నమలడం వలన ప్రయోజనం ఉంటుంది. వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నోటి దుర్వాసనకు చెక్..

ఉదయాన్నే లవంగాలు తినడం వలన నోటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దంతాల నొప్పి నివారణిగా పనిచేస్తుంది. నోటి వాపు, చిగురువాపు, నోటి దుర్వాసన నివారణకు అద్భుతంగా సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

లవంగాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మనం తినే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణ రసాల స్రావాన్ని ప్రోత్సహించి, కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్ పెడుతుంది.

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది..

లవంగాలలో మాంగనీస్, ఫ్లేవనాయిడ్స్ వంటి మూలకాలు ఉన్నాయి. ఇవి ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి. ఈ మూలకాలు కణజాలం మరమ్మతులో సహాయపడుతాయి. తద్వారా కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

ఇతర ప్రయోజనాలు కూడా..

ఇవే కాకుండా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నేచురల్ పెయిన్‌కిల్లర్‌గా పని చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..