Brain Tips: మెదడు చురుకుదనానికి అద్భుతమైన చిట్కాలు.. శాస్త్రవేత్తల పరిశోధనలలో కీలక విషయాలు

ఈ రోజుల్లో రకరకాల వైరస్‌లు చుట్టుముడుతున్నాయి. దీంతో అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల పాలై లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. మంచి పోషకాలున్న..

Brain Tips: మెదడు చురుకుదనానికి అద్భుతమైన చిట్కాలు.. శాస్త్రవేత్తల పరిశోధనలలో కీలక విషయాలు
Brain Exercises
Follow us
Subhash Goud

|

Updated on: Jan 01, 2023 | 8:00 AM

ఈ రోజుల్లో రకరకాల వైరస్‌లు చుట్టుముడుతున్నాయి. దీంతో అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల పాలై లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ముఖ్యం. రోజువారీగా వ్యాయామం చేయడం వల్ల అద్భుతమైన ఉపయోగాలుంటాయి. శరీర శ్రమ కండరాల మీద మాత్రమే ఫలితం చూపకుండా ఊపిరితిత్తుల్లకి చేరే గాలి మీద, మెదడుకు అందే ప్రాణవాయువు మీద, ఆలోచన మీద ఇలా అన్నింటిపైనా సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండేందుకు ఇదొక కారణమనే చెప్పాలి. 50-74 ఏళ్ల వయసు మధ్య ఉన్న 90 మందిపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. వారి జీవితంలో రోజువారీ శరీర శ్రమను గుర్తించే ట్రాకర్స్‌ అమర్చారు. అయితే ఈ పరిశోధనలో శరీర శ్రమ ఎక్కువగా చేసిన రోజున వారి మెదడు మరింతగా చురుగ్గా పని చేయడాన్ని పరిశోధకులు గుర్తించారు. నడివయసులో కూడా మన విశ్లేషణా సామర్థ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలి.

వ్యాయమంతో మెదడు చురుకుదనం:

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయమం లేదా శారీరక శ్రమ చేసేవారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శారీరక శ్రమ వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేసి.. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుందంటున్నారు. అయితే శరీరంలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి వాటికి కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి.. మెదడుపై ఒత్తిడి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

వ్యాయామం చేస్తే కండరాలే శరీరంలోని శక్తిలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటాయి. దీంతో ఇతర భాగాలు, అవయవాలు, మెదడుకు కూడా గ్లూకోజ్ సరిపడినంతగా అందదు. మెదడు, నాడీ వ్యవస్థలోని నాడీ కణాలు అత్యంత సున్నితమైనవి. దీంతో వ్యాయామం వల్ల శరీరంలో శక్తి తగ్గినప్పుడు.. మెదడును, నాడీ కణాలను రక్షించుకునేందుకు అవసరమయ్యే ప్రొటీన్లు, హార్మోన్లు వంటివి విడుదలవుతాయి. ఇదే సమయంలో ఇతర అవయవాలకు శక్తి రవాణాను తగ్గించి.. మెదడుకు అందిస్తాయి. దాంతో మెదడు మరింత శక్తిని పొందుతుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మన తీసుకునే ఆహారంపైనా దృష్టి పెట్టాలంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు అవసరమైన మేరకు ఉండేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..