Health Tips: తమలపాకే కదా అని తీసిపడేయకండి.. ఒక్క ఆకుతో బోలెడు ప్రయోజనాలు..

|

Feb 10, 2023 | 8:39 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు పెరిగిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తుతుంది. దీని పరిమాణం పెరగడాన్ని వైద్య భాషలో హైపర్‌యూరిసెమియా అంటారు.

Health Tips: తమలపాకే కదా అని తీసిపడేయకండి.. ఒక్క ఆకుతో బోలెడు ప్రయోజనాలు..
Betel Leaf
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు పెరిగిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తుతుంది. దీని పరిమాణం పెరగడాన్ని వైద్య భాషలో హైపర్‌యూరిసెమియా అంటారు. ఇది ప్లాస్మా యూరిక్ యాసిడ్ పెరిగే పరిస్థితి. యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు, అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

దీనికి వైద్యంలో అనేక చికిత్సలు ఉన్నప్పటికీ, ఔషధాలే కాకుండా కొన్ని ఇంటి నివారణల ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించవచ్చు. తమలపాకును తీసుకోవడం ద్వారా పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో తమలపాకు చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

ఒక పరిశోధన ప్రకారం.. తమలపాకు రసాన్ని కొన్ని ఎలుకలకు ఇవ్వడం జరిగింది. ఆ పరీక్షలో ఎలుకల్లో యూరిక్ యాసిడ్ స్థాయి 8.09mg/dl నుండి 2.02mg/dlకి తగ్గింది. తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కీళ్లలో అసౌకర్యం, నొప్పిని బాగా తగ్గిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి మొదలైన అనేక దీర్ఘకాలిక బలహీనపరిచే అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.

తమలపాకును ఎలా తీసుకోవాలి..

యూరిక్ యాసిడ్ రోగులు రోజూ తమలపాకులను నమలాలి. ఇది మీ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. అయితే, దీనిని తినేవారు ధూమపానానికి దూరంగా ఉండాలి.

తమలపాకుఇతర ప్రయోజనాలు..

1 నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది..

తమలపాకులలో అనేక యాంటీమైక్రోబయాల్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి నోటిలో నివసించే బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో తమలపాకులను తినడం వల్ల పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంతేకాదు.. నోటి దుర్వాసన రాకుండా ఉంచుతుంది. పంటి నొప్పులు, చిగుళ్ల నొప్పులు, వాపులు, నోటి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

భోజనం తర్వాత తమలపాకును తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియను పెంచుతాయి. రక్త ప్రసరణను ప్రేరిపిస్తాయి.

3. మధుమేహాన్ని నియంత్రిస్తుంది..

కొత్తగా నిర్ధారణ అయిన టైప్ 2 డయాబెటిక్ రోగులలో తమలపాకు పొడి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. తమలపాకులో యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ని నియంత్రించలేని కారణంగా ఏర్పడే మంటను తగ్గిస్తుంది. డయాబెటిస్ మెల్లిటస్ నిర్వహణలో తోడ్పడుతుంది.

గమనిక: పైన పేర్కొన్న చిట్కాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వృత్తిపరమైన వైద్య సలహాగా తీసుకోకూడదు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వైద్యులను సంప్రదించి, వారి సలహాలను పాటించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..