చలికాలంలో ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. శీతాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇది రక్త నాళాలు తాత్కాలికంగా కుంచించుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా రక్తపోటు బాధితులకు పలు సమస్యలు ఎదురవుతాయి. ఈనేపథ్యంలో శీతాకాలంలో అధిక బీపీని అదుపులో ఉంచడానికి, ప్రతిరోజూ ఖర్జూరాలు తినాలి. వీటిలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇక చలికాలంలో తీపి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఖర్జూరాలను తినడం మంచిది. ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ, అవి మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చలికాలంలో చాలా మంది రక్తహీనత సమస్యలను ఎదుర్కొంటారు. ఖర్జూరం సహాయంతో రక్తహీనతను అధిగమించవచ్చు. ఖర్జూరంలో ఐరన్, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన ఐరన్‌ను అందిస్తాయి. ఇక శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. వీటినుంచి ఉపశనమం కలిగించడంలో ఖర్జూరాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలతో, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. జలుబు, దగ్గును దూరం చేస్తాయి.
మలబద్ధకం బాధితులకు ఖర్జూరాలు మంచి ఆహారం. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలను తీసుకోవాలి. ఫలితంగా మలబద్ధకంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయి..రాత్రి పడుకునే ముందు కొన్ని ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తింటే జీవక్రియ సక్రమంగా పని చేస్తుంది.నానబెట్టిన ఖర్జూరంలో మాంగనీస్, కాపర్, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి పనిచేస్తాయి. అలాగే ఎముకలకు సంబంధించిన పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలను తినడం ద్వారా, మీరు రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఇవి అలసట, బలహీనతను తొలగిస్తాయి. అలాగే శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతాయి
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..