పాలు, పెరుగు, నెయ్యి, వెన్న.. ఇలా పాలకు సంబంధించిన పదార్థాలన్నీ ఏదో ఒక విధంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే చాలామంది మజ్జిగ కంటే పెరుగు తినడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అదే సమయంలో ఇవి రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం, పెరుగును మధ్యాహ్నానికి ముందు తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల బీపీ వస్తుంది. కాబట్టి, అల్పాహారం తర్వాత పెరుగు తినండి. చాలా మంది రాత్రిపూట పెరుగు తింటుంటారు. పెరుగు చల్లగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట దీన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో పాటు దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. పెరుగు తినడానికి ముందు ఎప్పుడూ వేడి చేయకూడదు. ఆయుర్వేదం ప్రకారం, పెరుగుతో పంచదార కలిపి తింటే మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక మజ్జిగ విషయానికొస్తే.. దీనిని ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీరు భోజనం తర్వాత తాగవచ్చు. అయితే, సాయంత్రం లేదా రాత్రిపూట తినడానికి ముందు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే ఉదర సంబంధిత సమస్యలు ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం ఉత్తమం. ఇక బరువు పెరగాలనుకుంటే, పెరుగు ఎక్కువగా తినండి. ఇందులోని కొవ్వు పదార్ధాల కారణంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే మజ్జిగ ఎక్కువగా తీసుకోండి. ఇది శరీరంలోని డీహైడ్రేషన్‌ని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..