Health: వెనక్కి నడవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెల్సా..?

వెనుకకు నడవటం వల్ల లభించే అత్యుత్తమ ప్రయోజనాల్లో స్థిరత్వం, నిలకడ మెరుగుపడటం వంటివి ఉన్నాయి. మన కీళ్లు, కండరాలు కదిలే పరిధి కూడా పెరుగుతుంది. తరచుగా వెన్ను నొప్పితో బాధపడే వారికి.. వెనుకకు నడవటం వల్ల ప్రయోజనం లభిస్తుంది.

Health: వెనక్కి నడవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెల్సా..?
Walking Backward

Updated on: Feb 23, 2024 | 4:40 PM

నడక ఆరోగ్యానికి మంచదనే అందరూ చెబుతారు. అన్నింటి కంటే బెస్ట్ ఎక్సర్‌సైజ్ కూడా ఇదే అంటారు. పైగా జిమ్‌కి వెళ్లాల్సిన పనిలేదు. రూపాయి ఖర్చు ఉండదు. మాములుగా నడవడం పక్కనబెడితే వెనక్కి నడిస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని.. చెబుతున్నారు. వాస్తవానికి మనం నిలబడినప్పుడు.. మన శరీరంలోని ఫోకస్, మూమెంట్, అబ్జర్వింగ్..  ఇతర వ్యవస్థలు వంటి వాటి మధ్య కో ఆర్డినేషన్ అవసరమవుతుంది. మనం వెనుక్కు నడిచినపుడు.. ఈ వ్యవస్థల మధ్య సమన్వయం కోసం మన మెదడుకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. అయితే మన బాడీ ఈ చాలెంజ్‌ను ఎదుర్కోవటం వల్ల.. మనకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయి. వెనక్కు నడిచేటపుడు మనం అడుగులు చిన్నవిగా వేస్తాం. దీంతో  అడుగులు ఎక్కువ వేస్తాం. మామూలుగా ముందుకు నడవటాని కన్నా.. అంతే దూరం వెనుకకు నడవటానికి మన బాడీ ఖర్చు చేసే శక్తి 40 శాతం అధికంగా ఉంటుంది. అయితే ముందుకు నడవడం అలవాటైన మనకు వెనక్కినడవడం కొంచెం రిస్కీ ప్రాసెస్. స్లో స్లోగా అలవాటు చేసుకోవాలి. వెనక్కి నడవడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

  • వెనుకకు నడవడం వల్ల మనం ముందుకు నడిచేటపుడు మన శరీరం నిలబడే తీరు, నిలకడ మెరుగుపడుతుంది.
  • మన కీళ్లు, కండరాలు కదిలే పరిధి కూడా పెరుగుతుంది.
  •  వెన్ను నొప్పితో బాధపడే వారికి.. వెనుకకు నడవటం వల్ల ప్రయోజనం లభిస్తుంది
  • ఆరోగ్యవంతమైన బరువు ఉండేలా చూసుకోవటానికి ఉపయోగపడుతుంది
  • శరీర కొవ్వులు ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుంది
  •  క్రీడా సామర్థ్యం కూడా పెరుగుతుంది
  •  మోకాలిలో కీళ్ల నొప్పులు ఉన్నవారికి స్వాంతన ఉంటుంది
  • మడమ నొప్పికి కారణాల్లో ఒకటైన ప్లాంటర్ ఫసీటీస్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అయితే.. వెనక్కు నడవాలనుకున్నప్పుడు..  మనం వేటినైనా  తగిలి పడిపోయే అవకాశం ఉండొచ్చు. కాబట్టి భద్రత కోసం మీకు బాగా పరిచయమున్న ప్రాంతంలో ఈ పద్దతిని మొదలు పెట్టటం మంచిది. లేదంటే పొలం మాదిరిగా..  ఖాళీగా ఉన్న ప్రాంతంలో చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. )

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..