
చింతపండుతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పీచు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-బి, విటమిన్-సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన జీవన విధానంలో చాలా అవసరమైనవి. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
డయాబెటిస్ బాధితులు చింతపండు తీసుకోవడం మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు. చింతపండు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుందట. ఇది టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. చింతపండులోని ఫైబర్, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ (HCA) వంటి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయట.
2018లో జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చింతపండు టైప్-2 డయాబెటిస్ రోగులలో ఇన్‌సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది. దీని వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం కూడా సాధ్యమవుతుంది.
చింతపండు ప్రయోజనకరమైనప్పటికీ దాన్ని లిమిటెడ్ గా తీసుకోవడం మంచిది. దీని అధిక వాడకం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు చింతపండును లిమిటెడ్ గా తీసుకోవాలి.
చింతపండు శరీరంలోని ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే చింతపండు అనేక జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)