Spinach Benefits: రక్తహీనత వేధిస్తుందా.. అయితే బచ్చలి కూరతో ఈ సమస్యకు చెక్‌ పెట్టండి..

మనం తినే ఆహారంలో పోషకాలు ఉంటే ఎలాంటి వ్యాధులు రావు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో అన్ని రకాల ప్రోటిన్లు, విటమిన్లు ఉండాలి. ..

Spinach Benefits: రక్తహీనత వేధిస్తుందా.. అయితే బచ్చలి కూరతో ఈ సమస్యకు చెక్‌ పెట్టండి..
Bachalikura

Updated on: May 11, 2022 | 2:37 PM

మనం తినే ఆహారంలో పోషకాలు ఉంటే ఎలాంటి వ్యాధులు రావు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో అన్ని రకాల ప్రోటిన్లు, విటమిన్లు ఉండాలి. ఆకు కూరల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బచ్చలి కూర(Spinach) శరీరానికి చాలా మంచిది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర దివ్య ఔషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడతారట. అధిక రక్తపోటు(blood pressure) సమస్య ఉన్నవారికి బచ్చలికూర చక్కటి మెడిసిన్‌(Medicine)లా పనిచేస్తుంది. హైబీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బచ్చలి ఆకుల రసం తాగినా రక్తపోటు అదుపులో ఉంటుంది.

బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. అంతేకాదు మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అధిక బరువుతో బాధపడేవారికి బచ్చలికూర చక్కటి డైట్. ఎందుకంటే బరువు తగ్గాలనుకునే వారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకోవడం మంచిది

మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. బచ్చలి కూర వల్ల మూత్రం విసర్జనలో సమస్యలు తొలగిపోతాయి. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమస్యను ఉపశమనం లభిస్తుందట. ఈ వేసవిలో బచ్చలి కూరను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే బచ్చలికూర ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.

Note:- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి

Read Also.. Health Tips: మీ శరీరంలో ఈ విటమిన్ లోపం అస్సలు రానివ్వకండి.. ప్రతి రోజూ ఈ ఫుడ్ తినండి..!