Benefits of Crying: నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఏడిస్తే కూడా అన్నే ఉన్నాయట

|

Jun 30, 2021 | 2:07 PM

Benefits of Crying: ఎవరికైనా బాధ వస్తే కంట కన్నీరు పెడుతుంది. అయితే అలా ఎవరైనా ఏడుస్తుంటే.. మనకు బాధ వేస్తుంది అయ్యో అనిపిస్తుంది. ఊరుకో అంటూ.. సముదాయిస్తాం.. అయితే నిజానికి నవ్వితే..

Benefits of Crying:  నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఏడిస్తే కూడా అన్నే ఉన్నాయట
Crying
Follow us on

Benefits of Crying: ఎవరికైనా బాధ వస్తే కంట కన్నీరు పెడుతుంది. అయితే అలా ఎవరైనా ఏడుస్తుంటే.. మనకు బాధ వేస్తుంది అయ్యో అనిపిస్తుంది. ఊరుకో అంటూ.. సముదాయిస్తాం.. అయితే నిజానికి నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో అన్నే ప్రయోజనాలు ఏడుపు వలన ఉన్నాయట. ఇంకా చెప్పాలంటే.. మనిషి అప్పుడప్పుడు ఏడిస్తే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆ మేలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

*ఏడుస్తున్నప్పుడు.. కన్నీరు వస్తుంది. అలా వచ్చే కన్నీరుతో కళ్ళల్లో ఉన్న దుమ్ము, మలినాలు బయటకు వెళ్లాయట. అంతేకాదు కంటినీరులో ఉండే ఐసోజైమ్ క్రిములు, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది.
*ఏడవడం వలన బీపీ కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యల బారిన పడటాన్ని తగ్గిస్తుంది.
* ఎక్కువ సమయం ఏడ్చేవారిలో ఆక్సిటోసిన్, ఇండ్రాఫిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇది ఫీల్ గుడ్ రసాయనం కావడంతో శారీరక, మానసిక భావేద్వేగాల సంబంధించిన మార్పులు కలుగుతాయి. నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
*ఏడుపు డిప్రెషన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* కన్నీరుతో శరీరంలోని విషతుల్యాలు బయటకుపోతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది.
*కన్నీళ్లు కంటికి ఒక వ్యాయామంలా పనిచేస్తాయి.దీనివల్ల కళ్లు ప్రశాంతతను కలిగి ఉంటాయి.
*ఏడుపు వల్ల ఎమోషనల్‌, ఫిజికల్‌ బాధలు తగ్గుతాయి.
*ఎడవడం వలన మనసులోఉన్న బాధ తగ్గి మనస్సు తేలిక అవుతోంది.

సో ఇన్ని ప్రయోజనాలు ఇచ్చే కన్నీరు ని కన్నీరు పెడుతున్న వారిని ఊరుకోబెట్టడం మానేసి.. కొంచెం సేపు వారిని అలా వదిలేస్తే.. వారే తమలో తాము సర్దుకుంటారు.

Also Read:   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. స్వామివారి సన్నిధిలో అఖండ రిలీజ్ పై క్లారిటీ