వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నారా.. అయితే ఇదొక్కటి మీ డైట్‌లో చేర్చుకోండి.. ఆ తర్వాత మీకే తెలుస్తోంది..

|

Feb 20, 2021 | 11:11 AM

Health Benefits of Chickpeas : ఆధునిక జీవన శైలిలో సమయ పాలన లేని పనులు, ఆహార అలవాట్లపు వల్ల అందరు బరువు సమస్యలు

వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నారా.. అయితే ఇదొక్కటి మీ డైట్‌లో చేర్చుకోండి.. ఆ తర్వాత మీకే తెలుస్తోంది..
Follow us on

Health Benefits of Chickpeas : ఆధునిక జీవన శైలిలో సమయ పాలన లేని పనులు, ఆహార అలవాట్లపు వల్ల అందరు బరువు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికంగా బరువు పెరిగి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వెయిట్ లాస్ కావడానికి జిమ్‌లు, యోగాలు అంటూ నానాపాట్లు పడుతున్నారు. అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. దీంతో వైద్యనిపుణులు వెయిట్ లాస్ కోసం చక్కటి ఉపాయం చెబుతున్నారు. బరువు తగ్గించుకునేవారు కాస్తంత టైమ్ కేటాయించి, వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మన చుట్టూ ఉండే కొన్ని ఆహార పదార్థాలే వెయిట్ లాస్ అయ్యేందుకు మనకు హెల్ప్ చేస్తాయి. అందులో ముఖ్యంగా శనగలు ఒకటి. శనగల్లో ప్రోటీన్, ఫైబర్ శాతాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువుని తగ్గించేందుకు సహకరిస్తాయి. శనగలు తినడం వల్ల కడుపు నిండినట్లుగా ఉంటుంది. అంతేకాదు, ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుతుంది. ఇందువల్ల శనగలను మీ డైట్‌లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయమేంటంటే శనగలు తీసుకోనివారికంటే.. శనగలు తీసుకున్నవారు త్వరగా బరువు తగ్గుతారని తేలింది.

సగం కప్పు శనగల్లో 6 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అందువల్ల ఇది హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు.శనగల్లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు, ఇందులోని ఎమినో యాసిడ్స్, ట్రైప్టోఫాన్, సెరోటొనిన్ వంటి విటమిన్స్ మంచినిద్రను అందిస్తాయి. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు శనగలు రెగ్యులర్‌గా తినడం మంచిది. పాలు, పెరుగు‌కి సమానమైన కాల్షియం శనగల్లో ఉంటుంది. వెజిటేరియన్స్ శనగలని తినడం వల్ల ప్రోటీన్ పొందినవారవుతారు. 100గ్రాముల శనగలను తీసుకోవడం ద్వారా ఏమేం లభిస్తాయంటే.. 164 మిల్లీ గ్రాముల లో కెలరీస్, 8.9 గ్రాముల ప్రోటీన్, 2. 5 గ్రాముల ఫ్యాట్, ఫైబర్ 8.6 గ్రాముల ఫైబర్, ఐరన్ 2.8 గ్రాములు ఉంటుంది. కనుక శనగలే కదా అని తీసేయకుండా మీ ఆహారంలో వీటిని చేర్చుకొని ఎన్నో లాభాలు పొందండని చెబుతున్నారు నిపుణులు.

మీరు బీపీతో బాధపడుతున్నారా..? అదుపులో లేకపోతే హార్ట్‌ఎటాకే.. ఈ జాగ్రత్తలు పాటించండి తర్వాత మీకే తెలుస్తోంది..