Nandivardhanam- Ayurveda: ప్రకృతిలో ఉన్న మొక్కలు మనకు అనేక ఔషధాలను ఇస్తాయి. అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ మొక్కలు వ్యాధులనుంచి నివారణ ఇస్తాయి. కలుపు మొక్కలు, అందం కోసం పెంచుకునే మొక్కలను కూడా ఆయుర్వేద మెడిసిన్ తయారు చేస్తారు. అలాంటి ఔషధ గుణాలున్న మొక్కలో ఒకటి మనం ప్రతి ఇంటి ముందు పెంచుకునే నందివర్ధనం చెట్టు. ఈ పువ్వులను దేవుని పూజకు ఉపయోగించడమే కాకుండా దీనిలో ఉండే ఔషధ గుణాలు వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడతాయి. ఈరోజు నందివర్ధనం మొక్క ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
*నందివర్ధనం చెట్టు వేర్లు చేదుగా వుంటాయి. దీని వేర్లను నమలడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
*నందిపువ్వుల రసం కంటి చూపు, చర్మ వ్యాధులకు మంచి ఔషధం.
* హెపటైటిస్ వలన వచ్చే కాలేయ నొప్పి , తీవ్రమైన విరేచనాలు కారణంగా కడుపు నొప్పికి నందిపువ్వులను ఉపయోగిస్తారు.
*నందివర్ధనం పువ్వులను మత్తుమందుగా, లైంగిక కోరికను పెంచడానికి , క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
*రక్తపోటును నియంత్రించడానికి నందివర్ధనం చెట్టు ఆకు కషాయాన్ని మంచి ఔషధం.
*నంది వర్ధనం విత్తనం చుట్టూ ఉండే ఎరుపు గుజ్జు బట్టలకు రంగు వేయడానికి ఉపయోగిస్తారు. దీని కలపను ధూపం, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు.
ఈ మొక్క ఆసియా దేశాలలో ఎక్కువగా పెరిగే మొక్క. ఈ చెట్టు పువ్వులు, ఆకులు, రసం , వేర్లు అన్నీ ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. వివిధ రోగాలను నియంత్రించడంలో ఉపయోగించబడతాయి.
Also Read: కఫం, దగ్గు, గొంతు నొప్పులను దరిచేరనీయని ఆవనూనెతో ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..