
Headphones
ఈ రోజుల్లో హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు మన జీవనశైలిలో భాగంగా మారాయి. ప్రయాణంతో పాటు, మల్టీమీడియా కంటెంట్‌ను వీక్షించడానికి హెడ్‌ఫోన్‌లు కూడా ఉపయోగిస్తున్నారు. మీరు కూడా ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్ వాడేవారైతే ఈ వార్త మీకోసమే. మ్యూజిక్ వినడానికి హెడ్‌ఫోన్స్ ఉపయోగించడం కొంత సమయం వరకు బాగానే ఉంటుంది, కానీ వాటిని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మన చెవులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌ల నుండి వచ్చే సౌండ్ మన కర్ణభేరిని తాకుతుందని, అందుకే వీటిని ఎక్కువగా వాడితే చెవులు దెబ్బతింటాయి. అలాగే గుండె జబ్బులు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లతో కలిగే ప్రమాదాలేమిటో, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం రండి.
దుష్ప్రభావాలివే..
- అధికంగా హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల వినికిడి సామర్థ్యం తగ్గిపోతుంది. ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎక్కువ సేపు పాటలు వినడం వల్ల చెవుల్లో తిమ్మిరి వస్తుంది. దీని వల్ల చెవుడు వచ్చే అవకాశం కూడా ఉంది.
- వైద్య నిపుణుల ప్రకారం ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మైకము, నిద్రలేమి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. మన చెవుల వినికిడి సామర్థ్యం 90 డెసిబుల్స్ మాత్రమే, అది క్రమంగా 40-50 డెసిబుల్స్‌కు తగ్గుతుంది.
- హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌లు మన చెవులకు మాత్రమే హానికరం కాదు. అవి మన గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి. పెద్దగా సౌండ్ పెట్టుకుని మ్యూజిక్ వింటే గుండెపై చెడు ప్రభావం చూపుతుంది. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది.
- ఆఫీసుల్లో లేదా ఇంట్లో పాటలు వింటున్నప్పుడు మీ ఇయర్‌ఫోన్‌లను ఒకరికొకరు పంచుకోకండి. ఇలా చేయడం వల్ల మీ చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది.
- చెవి సమస్యలను అధిగమించాలంటే అవసరమైనప్పుడు మాత్రమే ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్‌లను ఉపయోగించండి. రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువ ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను ఉపయోగించకూడదు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి