
వెంట్రుకలు విపరీతంగా రాలడం, అది నిరంతరంగా, స్పష్టంగా కనిపించి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే, తప్పక దృష్టి పెట్టాలి. ఇది తాత్కాలిక జీవనశైలి మార్పు ప్రతిస్పందన కావొచ్చు లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. మూల కారణాన్ని గుర్తించడం సరైన పరిష్కారాలను కనుగొనడానికి మొదటి అడుగు.
డీహెచ్‌ఐ ఇండియాలో బోర్డు సర్టిఫైడ్ సూపర్ స్పెషలిస్ట్, కాస్మెటిక్ ప్లాస్టిక్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విరల్ దేశాయ్ వెంట్రుకల పెరుగుదల చక్రాన్ని వివరిస్తారు. వెంట్రుకలు కుదుళ్ల నుండి పెరుగుతాయని, చిన్న రక్తనాళాలు వాటికి పోషణ అందిస్తాయని, హార్మోన్లు ఈ ప్రక్రియను నియంత్రిస్తాయని ఆయన వివరించారు. పెరుగుదల చక్రంలో మూడు దశలు ఉంటాయి:
ఇది వెంట్రుకల పెరుగుదల చురుకైన దశ. ఈ సమయంలో మూలంలోని కణాలు విభజించి కొత్త వెంట్రుకలు సృష్టిస్తాయి. ఇది వ్యక్తిగత కారకాలపై ఆధారపడి రెండు నుండి ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది.
ఇది రెండు నుండి మూడు వారాలు మాత్రమే ఉండే చిన్న పరివర్తన దశ. ఈ సమయంలో వెంట్రుకల కుదురు కుచించుకుపోయి డెర్మల్ పాపిల్లా నుండి వేరుపడుతుంది.
ఇది విశ్రాంతి దశ. ఈ సమయంలో వెంట్రుకల కుదురు విడుదల అవుతుంది, వెంట్రుక రాలిపోతుంది. ఇది సుమారు 100 రోజులు ఉంటుంది.
రోజుకు 50-100 వెంట్రుకలు రాలడం సాధారణం. అయితే, ముఖ్యమైన ఒత్తిడి కారకాలు విపరీతమైన వెంట్రుకల రాలడానికి కారణం అవుతాయి.
క్రాష్ డైట్‌లు లేదా వేగంగా బరువు తగ్గడం పోషకాల లోపం, ఒత్తిడి వల్ల వెంట్రుకలు రాలడానికి దారితీస్తుంది. ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు విపరీతమైన వెంట్రుకలు రాలడానికి కారణం అవుతాయి.
నిరంతర ఒత్తిడి వెంట్రుకల పెరుగుదల చక్రాన్ని దెబ్బతీస్తుంది, వెంట్రుకలు రాలడానికి దారితీస్తుంది. అధిక జ్వరం కలిగించే అనారోగ్యాలు వెంట్రుకలు రాలడాన్ని ప్రేరేపిస్తాయి. పెద్ద సర్జరీ శారీరక ఒత్తిడిని కలిగించి, వెంట్రుకలు రాలడానికి కారణం అవుతుంది.
థైరాయిడ్ సమస్యలు, ఆటోఇమ్యూన్ వ్యాధులు వంటి కొన్ని అనారోగ్యాలు వెంట్రుకలు రాలడానికి కారణం అవుతాయి.
గర్భనిరోధక మాత్రలు ఆపిన తర్వాత హార్మోన్ల మార్పులు వెంట్రుకలు రాలడానికి దారితీస్తాయి.
ఆహారంలో గణనీయమైన మార్పులు, నిద్ర లేకపోవడం, మానసిక గాయం వంటివి టెలోజెన్ ఎఫ్లూవియంను ప్రేరేపించవచ్చు.
ఈ రాలడం సాధారణంగా తాత్కాలికం. ఆరు నుండి తొమ్మిది నెలల్లో వెంట్రుకలు సాధారణ స్థితికి వస్తాయి.
సాధారణ వెంట్రుకల పెరుగుదల చక్రం అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు, ముఖ్యంగా పెరుగుదల (అనాజెన్) దశలో, వెంట్రుకలు రాలడం జరుగుతుంది. దీనిని అనాజెన్ ఎఫ్లూవియం అంటారు. సాధారణ రాలడం కాకుండా, ఈ రకం వెంట్రుకలు రాలడం అకస్మాత్తుగా, విపరీతంగా ఉంటుంది. ఇది సాధారణంగా అంతర్లీన సమస్యను సూచిస్తుంది. కొన్ని సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి.
వంశపారంపర్యంగా వెంట్రుకలు రాలడం, దీనిని తరచుగా ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు, ఇది చాలా సాధారణ కారణాలలో ఒకటి.
కొన్ని చికిత్సలు, ముఖ్యంగా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, వేగంగా విభజన చెందే వెంట్రుకల కుదురు కణాలకు ఆటంకం కలిగిస్తాయి. ఇది అకస్మాత్తుగా, విస్తృతంగా వెంట్రుకలు రాలడానికి దారితీస్తుంది.
బిగుతుగా ఉండే హెయిర్‌స్టైల్‌లు (జడలు, పోనీటైల్స్, బన్స్ లాంటివి) లేదా కఠినమైన రసాయన చికిత్సలు, వేడి స్టైలింగ్ సాధనాలు వెంట్రుకల షాఫ్ట్‌ను, కుదుళ్లను దెబ్బతీస్తాయి.
అలోపేసియా అరేటా వంటి సమస్యలు ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన వెంట్రుకల కుదుళ్లను పొరపాటున దాడి చేస్తుంది. ఇది ప్యాచ్‌లుగా లేదా విస్తృతంగా వెంట్రుకలు రాలడానికి దారితీస్తుంది.
ఇది ఒక మానసిక సమస్య. ఇందులో ఒత్తిడి లేదా ఆందోళన వల్ల తమ వెంట్రుకలను లాగేయాలనే కోరిక ఉంటుంది.