Hair Growth: హెయిర్‌కట్‌ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందా..? ఇది నిజమేనా?

|

Jan 22, 2023 | 12:14 PM

జుట్టును పెద్దగా పెరగాలని చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది అమ్మాయిలు హెయిర్ స్టైలింగ్, ట్రెండింగ్..

Hair Growth: హెయిర్‌కట్‌ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందా..? ఇది నిజమేనా?
Hair Growth
Follow us on

జుట్టును పెద్దగా పెరగాలని చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది అమ్మాయిలు హెయిర్ స్టైలింగ్, ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. అయినప్పటికీ, జుట్టుకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు అంటే జుట్టు రాలడం, చుండ్రు ఏర్పడటం లాంటివి. ఏర్పడినప్పుడు ఆందోళన చెందుతుంటారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి ట్రిమ్ చేయమని చాలా మంది మీకు సలహా ఇస్తుంటారు. కొందరికి పొడవాటి జుట్టు ఉంటుంది. ప్రతి సారి చిక్కులు పడినప్పుడల్లా ఊడిపోతుంటుంది. దీంతో జట్టును కత్తిరిస్తుంటారు. జుట్టును కత్తిరిస్తుంటే వేగంగా పెరుగుతుందని చెబుతుంటారు. నిజంగానే హెయిర్‌కట్‌ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుతుందా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

కొన్ని రోజులకొకసారి జుట్టును కత్తిరించుకుంటూ ఉంటే, వారి జుట్టు పొడవుగా పెరుగుతుందని ప్రజలు ఎప్పటినుంచో నమ్ముతున్నారు. అయితే జుట్టును కత్తిరించడం ద్వారా జుట్టు వేగంగా పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఆగిపోయిన ఎదుగుదల వేగవంతమవుతుందని భావించి మీరు జుట్టు కత్తిరించుకుంటే అది పొరపాటేనని చెబుతున్నారు. జుట్టు చివరలను కత్తిరించడం, వాటి పెరుగుదల మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు కుదుళ్లపై ప్రభావం ఉండదు. ఇది మీ జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది.

ట్రిమ్ చేయకపోతే జుట్టు ఎలా పెరుగుతుంది?

జుట్టు పెరగాలంటే మంచి ఆహారం, నూనెతో తలకు మసాజ్ చేయాలి. మనం మన జుట్టును బాగా క్రమం తప్పకుండా మసాజ్ చేసినప్పుడు మంచి ఫలితాలుంటాయంటున్నారు. హెయిర్ మసాజ్ సమయంలో నూనె ఫోలికల్‌లోకి చొచ్చుకుపోతుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మసాజ్ చేసేటప్పుడు రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. దీని కారణంగా సరైన పోషకాలు, ఆక్సిజన్ జుట్టు కుదుళ్లకు చేరుతాయి. దీని వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నూనె వాడాలి అని ఆలోచిస్తే కొబ్బరి నూనె, ఆముదం, లేదా బాదం నూనె ఎంతో మంచిదంటున్నారు. ప్రతి వారం వాటిని మసాజ్ చేయడం వల్ల మీ డ్యామేజ్ అయిన జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

పొడిగా, నిర్జీవంగా, బలహీనంగా కనిపించే పొడవాటి జుట్టు కలిగి ఉండటం వల్ల ప్రయోజనం లేదు. జుట్టు పొడవుతో పాటు, వారు మందంగా, బలంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. దీని కోసం మీరు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్, ఒమేగా -3, జింక్ పుష్కలంగా ఉంటాయి. మీరు సరిగ్గా తినకపోతే మీ ఆరోగ్యకరమైన పొడవాటి జుట్టు ఆరోగ్యంగా ఉండదు. అందుకే మీ ఆహారంలో చాలా ఆకు కూరలను ఎక్కువగా వాడాలి. అలాగే ఎక్కువ పండ్లు తినడం, నీరు కూడా ఎక్కువ తాగడం ఎంతో మంచిదంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి