Live Longer: ప్రస్తుతం ఆనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మానవునికి వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే దీర్ఘాయువును సుమారు 14 సంవత్సరాలు పెంచుకోవచ్చని నిపుణులు అధ్యయనం ద్వారా తేల్చారు. ఈ అధ్యయనం ఎటువంటి వ్యాధులు లేని 45 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్సు గల 20,244 మంది పురుషులు, స్త్రీలపై నిపుణులు అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనం ద్వారా దీర్ఘాయువు పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. వారు తీసుకునే ఆహారం, ప్రతి రోజు వ్యాయమం, విటమిన్స్ ఉండే పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చని గుర్తించారు.
ఆలహాల్ తీసుకోవడం..
మద్యం తాగడం వల్ల 90 ఏళ్లు దాటి జీవించలేరని అధ్యయనం ద్వారా తేల్చారు నిపుణులు. యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఆల్కహాల్ అబ్యూజ్ అండ్ ఆల్కహాలిజం ప్రకారం.. ప్రతి సంవత్సరం 88వేల మంది అమెరికన్లు ఆల్కహాల్ సంబంధిత కారణాల వల్ల మరణిస్తున్నారు. పొగాకు, సరైన ఆహారం తీసుకోకపోవడం కారణమంటున్నారు నిపుణులు. ఈ మరణాలలో 24 వేల మరణాలు సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్, ఇతర కాలేయ సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు.
ధూమపానం:
ప్రస్తుతం సిగరేట్ల తాగేవారి సంఖ్య కూడా భారీగానే ఉంది. సిగరేట్లు తాగితే క్యాన్సర్ భారీన పడతారని అధికారులు ఎంత అవగాహన కల్పించినా.. ఎవ్వరు కూడా మానడం లేదు. మనిషి మరణం కూడా వివిధ రకాల అలవాట్లతో ముడిపడి ఉంది. ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురవుతారని అధ్యయనం ద్వారా తేల్చారు నిపుణులు. ధూమపానం చేసేవారి ఆయుష్సు ధూమపానం చేయని వారికంతే 10 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. 40 సంవత్సరాల్లోపు ధూమపానం మానేయడం ద్వారా ధూమపాన సంబంధిత వ్యాధులతో మరణించేవారి శాతం 90 శాతం వరకు తగ్గించుకోవచ్చంటున్నారు.
► ఏ వ్యక్తి అయిన వంద ఏళ్లకుపైగా జీవించాలంటే ముందుగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇక కుటుంబ సభ్యులు, సమాజంతో చక్కని అనుబంధం కలిగి ఉండాలి.
► ధూమపానం, మద్యపానం చేయరాదు. కానీ రెడ్ వైన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుడా చేస్తుంది. అయితే రెడ్‌వైన్‌ను మితంగానే తాగాలి.
► మాంసాహారం మానేయాలి. ఆ ఆహారాన్ని తీసుకోవడం మానేయాల్సిందే. ఎందుకంటే శాకాహార భోజనం తినేవారు మాత్రమే 100 ఏళ్లకు పైబడి బతుకుతారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
► నిత్యం వ్యాయామం చేయాలి. కఠినతర వ్యాయామం అవసరం లేదు. సాధారణ వ్యాయామం అయినా సరే.. రోజూ చేయాయడం మంచిది.
► రోజూ కచ్చితంగా 8 గంటలు నిద్రించాలి. చాలా త్వరగా పడుకుని త్వరగా నిద్ర లేవాలి.