మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు. పరిశుభ్రత కూడా ఉండాలి. పరిశుభ్రత విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కొందరు రోజు స్నానం చేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండ్ పిల్లలు సరిగా స్నానం చేయరు. బయటకు వెళ్లి ఇంటికొచ్చిన తర్వాత చాలా మంది చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోరు. ఇలా సరైన జాగ్రత్తలను తీసుకోరు. తాజాగా ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థ ఓ విషయాన్ని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది చేతులను శుభ్రం చేసుకోవడం లేదని తెలిపింది.
కొన్ని సౌకర్యాలు లేక మరికొన్ని చోట్ల పరిశుభ్రతపై అవగాహన లేక ఇలా చేస్తున్నారని చెప్పింది. అభివృద్ధి చెందని దేశాల్లోని పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా చిన్న పిల్లులు చేతులు తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం లేదని నివేదికలో వెల్లడించింది. ఇలా చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే అనారోగ్యానికి గురవుతారని వైద్య నిపుణులు తెలిపారు. పేద దేశాల్లో ప్రతి పది మందిలో ఆరుగురికి చేతులను కడుక్కోవడానికి అవసరమైన సబ్బు, నీరు అందుబాటులో లేవని యూనిసెఫ్ తెలిపింది. కరోనా వేళ ఈ సమస్య మరింతగా పెరిగినట్లు పేర్కొంది. పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించింది. పెద్దవారు కూడా కచ్చితంగా శుభ్రత పాటించాలని వివరించింది. ‘ఇంటర్నేషనల్ హ్యాండ్‌వాష్ డే’ సందర్భంగా యునిసెఫ్ తాజా నివేదికను విడుదల చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 శాతం పాఠశాలల్లో చేతులు కడుక్కునేందుకు అవసరమైన సబ్బు, నీరు వంటి సదుపాయలు లేవని నివేదికలో తెలిపింది. అభివృద్ధి చెందని దేశాల్లోని 70 శాతం పాఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకోవడానికి స్థలం కూడా లేదని పేర్కొంది. ఇళ్లలో కూడా చేతులు కడుక్కునే సౌకర్యాలు లేవని చెప్పింది. ప్రభుత్వాలతో కలిసి చేతులు కడుక్కోవడాన్ని ప్రోత్సహించడానికి సామాగ్రిని అందుబాటులో ఉంచడానికి కృషి చేస్తామని తెలిపింది. యునిసెఫ్ చాలా సంవత్సరాలుగా ఎబోలా, కలరా వంటి అంటువ్యాధులతో పోరాడటానికి చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. చేతులు శుభ్రం చేసుకోకుంటే వ్యాధులు వస్తాయని హెచ్చరించింది.
We love this handwashing dance from Vietnamese dancer, Quang Đăng.
Washing your hands with soap and water is one of the first steps to protect yourself from #coronavirus. pic.twitter.com/lmXLbR3hZa
— UNICEF (@UNICEF) March 3, 2020
Read Also.. Least Sleeping: బలవంతంగా నిద్ర పక్కన పెట్టి టీవీ చూస్తున్నారా? ఇది చాలా ప్రమాదం..ఎందుకంటే..