Gonorrhea: మాయదారి రోగం.. అలక్ష్యం చేస్తే మా చెడ్డ ప్రమాదం

గనేరియా అనేది లైంగికంగా సంక్రమించే ఒక సాధారణ బాక్టీరియా. గనేరియాతో బాధపడేవారికి లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. గనేరియాను మందుల ద్వారా నయం చేయవచ్చు. అయితే, మీరు త్వరగా చికిత్స చేయకపోతే, ఇది భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Gonorrhea: మాయదారి రోగం.. అలక్ష్యం చేస్తే మా చెడ్డ ప్రమాదం
Gonorrhea

Updated on: Nov 23, 2024 | 11:30 AM

గనేరియా అనేది లైంగిక సంక్రమణ వ్యాధి. ఇది నిస్సిరియా గనేరియా అనే బాక్టీరియా వలన సంభవిస్తుంది. ఈ అంటువ్యాధి ఉన్నవారితో అసురక్షితమైన లైంగిక సంబంధం కలిగి ఉన్నపుడు ఇది వ్యాప్తి చెందుతుంది. గనేరియా ఉన్న వ్యక్తులు ఎటువంటి సంకేతాలు, లక్షణాలను చూపించరు. లక్షణాలు ఉంటే, అవి తేలికపాటివిగా ఉంటాయి. మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట ఉంటుంది.

పురుషుల్లో ఉండే లక్షణాలు:*
  • 1. పురుషాంగం నుండి తెల్లని, పసుపు లేదా ఆకుపచ్చ రంగులో స్రావాలు
  • 2. వృషణాల నొప్పి లేదా వాపు (ఇది అరుదుగా కనిపిస్తుంది)
మహిళలలో ఉండే సాధారణ లక్షణాలు:
  • ఋతు చక్రాల మధ్య సమయంలో యోని నుండి అసాధారణ రక్త స్రావం
  • యోని నుండి అధికంగా స్రావాలు రావడం
పురుషులు,  స్త్రీలు ఇద్దరిలో కనిపించే సాధారణ లక్షణాలు:
    • పుండ్లు పడడం
    • రక్తస్రావం లేదా డిచ్ఛార్జ్ (స్రావాలు)
    • మలద్వార దురద
    • బాధాకరమైన మలవిసర్జన
ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ బ్యాక్టీరియా… వ్యాధి సోకిన వ్యక్తుల వీర్యం, వీర్యం ముందు స్రవించే ద్రవాలు, యోని ద్రవాలలో కనిపిస్తుంది.  అందువల్ల అది ప్రధానంగా అసురక్షిత యోని, యానల్ లేదా ఓరల్ శృంగారం ద్వారా వ్యాపి చెందుతుంది. కలుషిత ద్రవాలను (ఫ్లూయిడ్స్) తాకిన చేతులతో కళ్ళును తాకడం వలన కళ్ళలో కూడా సంక్రమణం (ఇన్ఫెక్షన్) కలుగుతుంది. ఇది ప్రసవ సమయంలో సంక్రమిత తల్లి నుండి శిశువుకి కూడా వ్యాపిస్తుంది/సంక్రమిస్తుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి..  చికిత్స ఏమిటి?

ముందుగా, వైదులు వివరణాత్మకంగా సింటమ్స్ తెలుసుకుంటారు. తరువాత సంపూర్ణ భౌతిక పరీక్ష ఉంటుంది. వీటి ఆధారంగా, వైద్యులు ఈ క్రింది పరీక్షలను ఆదేశిస్తారు:

–ప్రభావిత ప్రదేశం నుండి నమూనాను సేకరించి పరిక్షించడం

–సేకరించిన నమూనాల సాగు, నమూనాల మైక్రోస్కోపిక్ పరీక్ష, న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ పరీక్ష

–పరీక్ష కోసం మూత్రం నమూనాను సేకరించడం

చికిత్స పద్ధతులు ఈ క్రింది విధంగా ఉంటాయి:

డ్యూయల్ థెరపీ యాంటీబయాటిక్స్, ఇవి ఒక మోతాదుగా నోటి ద్వారా తీసుకునేవి, మరొక మోతాదుగా ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్‌గా ఇవ్వబడేవి. వ్యాధి సంక్రమిత వ్యక్తికి సంబంధించి లైంగిక భాగస్వాములుతప్పనిసరి పరీక్షలు  చేయించుకోవాలని సలహా ఇస్తారు. గనేరియాకు చికిత్స పొందుతున్న వ్యక్తులు క్లామిడియాకు చికిత్సను కూడా అందించాలి. చికిత్స ముగిసేంత వరకు శృంగారానికి దూరంగా ఉండాలి.

ఈ వివరాలు ఆరోగ్యం పట్ల మీ ప్రాథమిక అవగాహన కోసమే అని గమనించాలి. మీ డాక్టరుకి ఇది ప్రత్యామ్నాయము కాదు. ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉన్నా వైద్యులను సంప్రదించండి…

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.