Glucose water: గ్లూకోజ్ వాటర్‌ తెగ తాగేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి..

వేసవిలో చాలా మందికి ఒంట్లో శక్తి క్షీణించి నీరసంగా ఉంటారు. దీంతో తక్షణ శక్షి కోసం గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన వచ్చిన తర్వాత, గ్లూకోజ్‌ వాటర్‌ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. గ్లూకోజ్ నీటిని తాగిన వెంటనే తక్షణ శక్తి పెరగడం సర్వ సాధారణం. దీంతో చాలా మంది గ్లూకోజ్ అతిగా వినియోగిస్తుంటారు. గ్లూకోజ్ నీరు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ దీని కారణంగా అనేక దుష్ర్పభావాలు..

Glucose water: గ్లూకోజ్ వాటర్‌ తెగ తాగేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి..
Glucose Water

Updated on: Jun 12, 2024 | 12:20 PM

వేసవిలో చాలా మందికి ఒంట్లో శక్తి క్షీణించి నీరసంగా ఉంటారు. దీంతో తక్షణ శక్షి కోసం గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన వచ్చిన తర్వాత, గ్లూకోజ్‌ వాటర్‌ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. గ్లూకోజ్ నీటిని తాగిన వెంటనే తక్షణ శక్తి పెరగడం సర్వ సాధారణం. దీంతో చాలా మంది గ్లూకోజ్ అతిగా వినియోగిస్తుంటారు. గ్లూకోజ్ నీరు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ దీని కారణంగా అనేక దుష్ర్పభావాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి, ఈ పానీయం అందరికీ ఉపయోగకరంగా ఉండదు. అతిగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలను కలిగిస్తుంది. గ్లూకోజ్‌ని ఎవరు తీసుకుంటే ప్రమాదమో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణ లేదా తక్కువ రక్త చక్కెర స్థాయిలు ఉన్నవారు గ్లూకోజ్ నీటిని తాగవచ్చు. అయితే షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రం గ్లూకోజ్ వాటర్ తాగకూడదు. చక్కెర కూడా గ్లూకోజ్‌లో ఒక భాగం. అందువల్ల, బ్లడ్ షుగర్ రోగులు గ్లూకోజ్ తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. దీని వల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కొలెస్ట్రాల్‌ సమస్యలున్న వారుకూడా గ్లూకోజ్‌ వాటర్ తీసుకోకూడదు. వీరు ఎట్టిపరిస్థితుల్లోనూ గ్లూకోజ్ వాటర్‌కు దూరంగా ఉండాలి. వీరికి కూడా గ్లూకోజ్ శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది.

అధిక బరువున్న వ్యక్తులు గ్లూకోజ్‌ను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే అదనపు గ్లూకోజ్ శరీరంలో కొవ్వుగా మారుతుంది. ఆ కొవ్వు శరీరంలోని వివిధ భాగాలలో గూడుకట్టుకుంటుంది. దీంతో ఊబకాయం సమస్య మరింత పెరుగుతుంది. గుండె. డిమెన్షియా వంటి సంక్లిష్ట వ్యాధులకు అధిక చక్కెర కారణమని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి అవసరం అయితే తప్ప గ్లూకోజ్ వాటర్ తాగకపోవడమే మంచిది. ఎండ నుంచి వచ్చిన తర్వాత గ్లూకోజ్ వాటర్ తాగడానికి బదులుగా ఉప్పు – చక్కెర కలిపిన నీళ్లు త్రాగవచ్చు. అధికంగా చెమటలు పట్టినప్పుడు శరీరంలో సోడియం లోపాన్ని భర్తీ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.