వర్షాకాలంలో ఎంత ప్రమాదకరమో.. శీతాకాలం కూడా అంతకు మించి అని చెప్పుకోవాల్సిందే. శ్వాసకోస సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లయితే ఈ సీజన్ అంతా అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే.. రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి, అంతర్గతంగా మనల్ని మనం కాపాడుకోవడానికి సీజన్లకు అనుగుణంగా తీసుకునే ఆహారాన్ని మార్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. శీతాకాలంలో సుగంధ ద్రవ్యాలు, రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలను తీసుకోవాలి. వీటిలో ప్రధానంగా వెల్లుల్లి గురించి చెప్పుకోవచ్చు. ఇందులో విటమిన్లు, ఖజినాలు, కాల్షియం, ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ఇష్టమైన వంటకాలు చేసుకున్నప్పుడు ఆ వంటకాల్లో వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. తద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
1. వెల్లుల్లి జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది.
2. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
3. శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
4. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
5. గుండె జబ్బులను నివారిస్తుంది.
6. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
7. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
8. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లిని నమిలి గానీ, చూర్ణం చేసుకుని గానీ తీసుకోవచ్చు. లేదంటే వంటకాల్లోనూ వినియోగింవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శీతాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి వైరస్‌లతో పోరాడే తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇందులో పేర్కొన్న అంశాలు నిపుణులు అభిప్రాయలు మాత్రమే. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..