తేనెలో వెల్లుల్లి కలుపుకోని తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇది రోజు తినడం వలన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇది యాంటీ బయాటిక్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇవే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తినడం వలన అనేక ప్రయోజనాలున్నాయి.
1. బరువు తగ్గడం..
వెల్లుల్లి తేనెను తినడం ద్వారా.. జీవక్రియ వేగంగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహయపడుతుంది.
2. జలుబు..
ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తినడం వలన జలుబు తగ్గుతుంది. అంతేకాకుండా… శరీరాన్ని వెచ్చగా ఉండటానికి సహయపడుతుంది.
3. గొంతు నొప్పి..
తేనె, వెల్లుల్లిలో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. గొంతు నొప్పితో మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
4. గుండె ఆరోగ్యానికి..
ఈ మిశ్రమం… గుండె ధమనులలో పేరుకుపోయిన కొవ్వును బయటకు తీసుకువస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
5. ఫంగల్ ఇన్ఫెక్షన్..
తేనె, వెల్లుల్లి రెండు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడతాయి.
6. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది…
వెల్లుల్లి, తేనె మిశ్రమం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ సరిగా మొదలవుతుంది.
7. దంతాల ఆరోగ్యం..
భాస్వరం అనే మూలకం వెల్లుల్లి, తేనెలో అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లి.. తేనె మిశ్రమం ఎలా తయారు చేయాలి…
ఒక గాజు సీసాలో తేనె వేసి.. అందులో కొన్ని వెల్లుల్లి లవంగాలను వేయాలి. ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే.. ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తినాలి.
Also Read: Karthi: హీరో కార్తీ మంచి మనసు.. కూచిపూడి కళాకారులకు అండగా నిలిచిన హీరో.. 50 మందికి ఆర్థిక సాయం…
Esha Rebba: మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనున్న తెలుగమ్మాయి.. అరవింద్ స్వామి సినిమాలో ఈషా..